తెలంగాణ

హైదరాబాద్‌కు నీటి గండం.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హెచ్చరిక!

రచన: Mamatha puppala••3 నిమిషాల పఠనం

హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సమస్య మళ్లీ తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఈ ఏడాది తగినంత వర్షపాతం నమోదు కాకపోవడం, జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పడిపోవడంతో రాబోయే వేసవి కాలంలో నగరవాసులకు తీవ్ర నీటి కొరత ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు.

 హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సమస్య మళ్లీ తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఈ ఏడాది తగినంత వర్షపాతం నమోదు కాకపోవడం, జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పడిపోవడంతో రాబోయే వేసవి కాలంలో నగరవాసులకు తీవ్ర నీటి కొరత ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు.

 నీటి వృథాను నివారించి, పొదుపుగా వాడుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగర తాగునీటి అవసరాలు తీర్చే సింగూరు, మంజీరా ప్రాజెక్టుల్లో ప్రస్తుతం కేవలం 80 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయని అధికారులు వెల్లడించారు. కొత్తగా నీటి ప్రవాహాలు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు.

  ప్రస్తుతం ఉన్న నిల్వలు డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని, దీంతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌‌లతో పాటు గోదావరి, కృష్ణా నదుల నుంచి నీటిని తరలించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల వేసవి నాటికి భూగర్భ జలాలు మరింత క్షీణించి బోర్లు ఎండిపోయే ముప్పు ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

 ఇప్పటికే భూగర్భ జలాలు 50 శాతానికి కంటే తక్కువ పడిపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ నీటిని పొదుపు చేయాలని కోరారు. తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా జలమండలి, సంబంధిత శాఖల అధికారులు సమగ్ర ప్రణాళికతో ముందస్తు చర్యలు చేపట్టాలని కిషన్ రెడ్డి సూచించారు. ఆకస్మిక కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ పంపింగ్ వ్యవస్థలు, ఇతర నిల్వ మూలాలను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.

#HyderabadWaterScarcity#KishanReddy#WaterCrisis#SingurProject#ManjiraDam#TelanganaNews#HyderabadNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి