తెలంగాణ

Tholi Mudda: ‘తొలిముద్ద’తో చిన్నారులకు పౌష్టికాహారం- మంత్రి జూపల్లి కృష్ణారావు

రచన: NK••4 నిమిషాల పఠనం

చిన్నారుల ఎదుగుదలకు తొలిదశ నుంచే పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో అల్పాహార పథకం ‘తొలిముద్ద’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అల్పాహార (‘తొలిముద్ద’) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలకు అల్పాహారాన్ని మంత్రి జూపల్లి స్వయంగా తినిపించారు.

Tholi Mudda: చిన్నారుల ఎదుగుదలకు తొలిదశ నుంచే పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో అల్పాహార పథకం ‘తొలిముద్ద’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అల్పాహార (‘తొలిముద్ద’) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలకు అల్పాహారాన్ని మంత్రి జూపల్లి స్వయంగా తినిపించారు.

పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు

మూడు నుంచి ఆరేళ్ల చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి పౌష్టికాహారం ఎంతో కీలకమని మంత్రి జూపల్లి అన్నారు. చిన్నారులకు ఉదయం అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు. అక్టోబర్ 1 నుంచి నాగర్‌కర్నూల్‌తో పాటు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో తొలిదశలో ‘తొలిముద్ద’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని కోరారు. పౌష్టికాహారంతో పాటు ప్రీ-స్కూల్ విద్య అందించడం ద్వారా చిన్నారుల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు.

ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం

అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘తొలిముద్ద’ కార్యక్రమం సక్రమంగా అమలయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. గ్రామస్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిదండ్రులు సహకరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు.

#Tholi Mudda#Minister Jupally Krishna Rao#Breakfast Scheme#Kollapur#Anganwadi#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి