సినిమా

Nani: జానర్ మార్చుకుంటున్న నాని.. మళ్లీ క్లాస్ సినిమాలకే గ్రీన్ సిగ్నల్!

రచన: Anshu•••5 నిమిషాల పఠనం

Nani: నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వచ్చిన ‘ది ప్యారడైజ్’ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో.. నాని తన తదుపరి సినిమాల విషయంలో మరోసారి ఆలోచనలో పడినట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, వరుసగా డిఫరెంట్ జానర్లను టచ్ చేస్తున్న నాని..

Nani: నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వచ్చిన ‘ది ప్యారడైజ్’ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో.. నాని తన తదుపరి సినిమాల విషయంలో మరోసారి ఆలోచనలో పడినట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, వరుసగా డిఫరెంట్ జానర్లను టచ్ చేస్తున్న నాని.. ఇకపై తనకు బాగా సెట్ అయ్యే క్లాస్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్స్ వైపు మళ్లీ ఆసక్తి చూపిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.

అంచనాలు తలకిందులు చేసిన ‘ప్యారడైజ్’:

నాని కెరీర్‌లోనే కాస్త డిఫరెంట్ జానర్‌లో తెరకెక్కిన చిత్రంగా ‘ది ప్యారడైజ్’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ‘దసరా’ తర్వాత నాని చేసిన ఈ సినిమా.. మరింత రా అండ్ రస్టిక్ టచ్‌తో రూపొంచారు. నాని కూడా తన ఇమేజ్‌కు భిన్నంగా కనిపించేందుకు కొత్త మేకోవర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

అయితే, సినిమా విడుదల తర్వాత వచ్చిన టాక్ మాత్రం సినిమాకు మైనస్ అయింది. ముఖ్యంగా కథనం, ట్రీట్‌మెంట్ విషయంలో ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దాంతో, ఇన్నాళ్ళు చేస్తున్న మాస్ అండ్ యాక్షన్ సినిమాలకి కొంతకాలం బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాడట నాని.

నెక్స్ట్ సినిమాల నుంచి జానర్ మార్చే ఆలోచనలో నాని?

‘ప్యారడైజ్’ ఫలితం తర్వాత నాని తన కథల ఎంపిక విషయంలో మరోసారి తన స్ట్రాటజీని మార్చుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి. గతంలో నాని ‘భలే భలే మగాడివోయ్’, ‘నిన్ను కోరి’, ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగ రాయ్’, ‘హాయ్ నాన్న’ వంటి సినిమాలతో క్లాస్ అండ్ ఎమోషనల్ కథల్లో తనదైన మార్క్ చూపించాడు.

మళ్ళీ ఇలాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌లు చూడాలని భావిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. త్వరలో ఓజీ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ‘ బ్లడీ రోమియో ’ సినిమాలో నాని నటించబోతున్నాడు. ఇందులో, యాక్షన్ అంశాలు ఉన్నప్పటికీ, అది ‘దసరా’, ‘ది ప్యారడైజ్’ తరహాలో ఉన్న మాస్ ఎలిమెంట్స్ కాకుండా, కాస్త స్టైలిష్ అండ్ క్లాస్ సీక్వెన్సెస్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత నాని పూర్తిగా ఫ్యామిలీ, ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలను లైనప్ చేసుకోనున్నాడట.

ఇటీవల ‘ఇరుముడి’తో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు శివ నిర్వాణతో నాని మళ్ళీ సినిమా చేయడానికి సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. గతంలో నాని-శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ‘నిన్నుకోరి’, ‘టక్ జగదీష్’ చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగా మెప్పించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే, మళ్ళీ ఆ తరహా చిత్రాలను ఒప్పుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే, వెంకీ అట్లూరితో కూడా చర్చలు జరిపినట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

#nani#sujeeth#shiva nirvana#venkey atluri#tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి