తెలంగాణ

BRS: రెండున్నరేళ్లలో రూ.50వేల కోట్లు దోచేశారు.. సీఎం రేవంత్ కుటుంబంపై బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు

రచన: NK••4 నిమిషాల పఠనం

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆస్తుల వివాదం తారస్థాయికి చేరింది. గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని, ఉద్యమం పేరుతో వేల కోట్ల ఆస్తులు సంపాదించారని, వందల ఎకరాల భూములు కబ్జా చేశారని చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. దీనికి బీఆర్ఎస్ నాయకులు అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు.

BRS: తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆస్తుల వివాదం తారస్థాయికి చేరింది. గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని, ఉద్యమం పేరుతో వేల కోట్ల ఆస్తులు సంపాదించారని, వందల ఎకరాల భూములు కబ్జా చేశారని చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. దీనికి బీఆర్ఎస్ నాయకులు అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు.

అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్, ఆయన కుటుంబం వేల కోట్ల రూపాయలు దోచేసిందని సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ రెండున్నరేళ్లలో అనుముల కుటుంబం తెలంగాణ మీద పడి దోచుకున్న సొమ్ము అక్షరాల రూ.50వేల కోట్లు అంటూ ఆరోపించింది. ముఖ్యమంత్రి పదవిని వాడుకుని రేవంత్ రెడ్డి తెలంగాణను లూటీ చేస్తున్నారని విరుచుకుపడింది. ఈ మేరకు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ పెట్టిన పోస్టు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో సీఎం కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలు అమాంతం విస్తరించాయని బీఆర్ఎస్ ఆరోపించింది. పలు సంస్థలకు ముఖ్యమంత్రి కుటుంబంతో సంబంధం ఉందంటూ.. ఆయా సంస్థల వివరాల జాబితాను సోషల్ మీడియాలో పెట్టింది బీఆర్ఎస్. మెడికవర్ హాస్పిటల్స్, మ్యాక్స్ బీఎన్ ఫార్మా, గీతా ఆటోమోటివ్స్, టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, స్వచ్ఛ బయో, శోదా కన్‌స్ట్రక్షన్స్, మైండ్ వాల్ట్ కన్‌స్ట్రక్షన్స్ (స్కూల్స్) వంటి సంస్థలు వేగంగా అభివృద్ధి చెందాయని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ కంపెనీలు భారీ అవకతవకలకు పాల్పడుతున్నాయని.. దీనికి సంబంధించిన పత్రాలను ఈడీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాని కార్యాలయం, రాష్ట్రపతి కార్యాలయాలతో పాటు ప్రతిపక్ష నేతలకూ అందజేస్తామని బీఆర్ఎస్ తెలిపింది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో ముఖ్యమంత్రి రేవంత్, ఆయన కుటుంబం రూ.50వేల కోట్లు దోచేసిందంటూ బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారమే రేపాయి. తన గురించి, తన కుటుంబం గురించి బీఆర్ఎస్ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఈ ఆరోపణలను ఏ విధంగా తిప్పికొడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఈ లూటీ వ్యవహారం రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.

#Brs#Congress#Telangana Politics#Swechaa News#Cm Revanth Reddy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి