తెలంగాణ

BRS : ఎకరం రూ.200 కోట్లు.. రూ.10 వేల కోట్లు తెచ్చిన రేవంత్ రెడ్డి : మన్నె క్రిశాంక్

రచన: Kumar••6 నిమిషాల పఠనం

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన భూముల కబ్జాలు, సీఎం తెచ్చిన అప్పులపై కీలక ప్రశ్నలు లేవనెత్తారు. తాను అడిగే ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన భూముల కబ్జాలు, సీఎం తెచ్చిన అప్పులపై కీలక ప్రశ్నలు లేవనెత్తారు. తాను అడిగే ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ప్రెస్‌మీట్ నిర్వహించిన ప్రతిసారి పోలీసులు అరెస్టు చేయడం, బెదిరింపులకు గురిచేయడం చేస్తునన్నారని, అయినప్పటికీ వెనకడుగు వేసేది లేదని స్పష్టంచేశారు.

అయితే, హైదరాబాద్ మహానగరం పరిధిలోని 818 ఎకరాల భూములు తాకట్టు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. ఒక్క ఎకరం విలువ రూ.200 కోట్లు ఉండగా.. ఎకరానికి కేవలం రూ.17 కోట్లకే తాకట్టు పెట్టారని ఆరోపించారు.ఏరియాల తాకట్టు పెట్టిన భూముల వివరాలు వెల్లడించారు.

ఇజ్జత్‌నగర్ (శేరిలింగంపల్లి)లో సర్వే నంబర్ 5/2–5/23లోని 26 ఎకరాలు, మొకిలాలో సర్వే నంబర్ 96లోని 41 ఎకరాలు, మియాపూర్ సర్వే నంబర్ 21లోని 105 ఎకరాలు, ఇస్నాపూర్‌లో సర్వే నంబర్ 496లోని 27 ఎకరాలు, ఇంజాపూర్ 126/Pలోని 22 ఎకరాలు, చిలుకూరు సర్వే నంబర్ 472లోని 49 ఎకరాలు, పఠాన్‌చెరు సర్వే నంబర్ 639లోని 17 ఎకరాలు, గాజులరామారంలో సర్వే నంబర్ 220/Pలోని 44 ఎకరాలు, జవహర్‌నగర్ సర్వే నంబర్ 12లోని 449 ఎకరాలు, జవహర్‌నగర్ సర్వే నంబర్ 706లోని 35 ఎకరాలు అని తెలిపారు. 31-03-2026 నాటికి హెచ్‌ఎండీఏ బ్యాంకు ఖాతాలో రూ.275 కోట్లు మాత్రమే ఉన్నాయని.. కానీ, జూన్ 30 నాటికి అదే బ్యాంకు ఖాతాలో రూ.10 వేల కోట్లు జమ అయ్యాయని తెలిపారు.

దీని ప్రకారం అతి తక్కువ ధరకు భూములను రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు తెచ్చారన్నారు.దీనికి తోడు నెల్లూరుకు చెందిన KLSR ఇన్ఫ్రా సంస్థకు రేవంత్ రెడ్డి కాంట్రాక్టులు అప్పజెబుతూనే ఉన్నారని.. రేవంత్ రెడ్డి పీసీసీ‌ చీఫ్‌గా ఉన్నప్పుడు KLSR ఇన్ఫ్రా సంస్థ బహుమతిగా ఇచ్చిన కారులోనే తిరిగేవాడని పేర్కొన్నారు. ఆ సంస్థ రేవంత్ రెడ్డి బినామీ సంస్థ అని, విచారణ చేస్తున్నామని ఈడీ చెప్పిందని గుర్తుచేశారు. అన్ని కాంట్రాక్టులు అదే సంస్థకు ఎందుకు ఇస్తున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి 818 ఎకరాలు తాకట్టు పెట్టిన దాంట్లో ఒక స్థలం.. జవహర్‌నగర్ సర్వే నంబర్ 12లో ఉన్న భూమిని 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జెన్‌పాక్ట్ అనే ఐటీ కంపెనీకి ఎకరానికి రూ.28 లక్షల చొప్పున విక్రయించిందని గుర్తుచేశారు.కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ KLSR వాళ్లు ఈ జెన్‌పాక్ట్ స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ స్థలం విలువ రూ.5 వేల కోట్లు అని చెప్పారు. ఈ 50 ఎకరాల భూమిని KLSR వాళ్లకు ఎలా ఇచ్చారు? దానికి ఎవరు అనుమతి ఇచ్చారు?అని ప్రశ్నించారు.

తాను రేవంత్ రెడ్డి బాగోతం బయట పెడుతుంటే బెదిరించాలని చూస్తున్నారని.. ‘ఏం పీక్కుంటారో పీక్కోండి’ అంటూ మన్నె క్రిశాంక్ సవాల్ విసిరారు. తాను ప్రెస్‌మీట్ పెడుతున్నానని నిన్న అనగానే కాంగ్రెస్ సోషల్ మీడియా ‘క్రిశాంక్ కృష్ణలీలలు’ అంటూ ట్వీట్లు వేయడం మొదలెట్టారని చెప్పారు. ‘అందరికీ ఒకటే స్క్రిప్ట్.. కాంగ్రెస్ సోషల్ మీడియా నడిపే వాడు కనీసం వేర్వేరు కామెంట్స్ అయినా ఇవ్వాలి కదరా భాయ్’ అంటూ సెటైర్లు వేశారు.

#manne krishank#BRS#Congress#Revanth reddy#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి