National

NMCRules: డాక్టర్లు రీల్స్ చేయొచ్చా? కేంద్రం కొత్త మార్గదర్శకాలు ఇవే!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

సోషల్ మీడియా యుగంలో వైద్యులు ఇన్ఫ్లుయెన్సర్లుగా మారిపోతున్న తరుణంలో, నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) డిజిటల్ హెల్త్ మార్కెటింగ్‌పై సంచలన ఆంక్షలు విధిస్తూ కొత్త నిబంధనలను విడుదల చేసింది. డాక్టర్లు ఆన్‌లైన్ వేదికల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించవచ్చని, అయితే దానిని బిజినెస్ ప్రమోషన్, పేషెంట్లను ఆకర్షించే సాధనంగా మార్చుకోకూడదని స్పష్టం చేసింది.

 సోషల్ మీడియా యుగంలో వైద్యులు ఇన్ఫ్లుయెన్సర్లుగా మారిపోతున్న తరుణంలో, నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) డిజిటల్ హెల్త్ మార్కెటింగ్‌పై సంచలన ఆంక్షలు విధిస్తూ కొత్త నిబంధనలను విడుదల చేసింది. డాక్టర్లు ఆన్‌లైన్ వేదికల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించవచ్చని, అయితే దానిని బిజినెస్ ప్రమోషన్, పేషెంట్లను ఆకర్షించే సాధనంగా మార్చుకోకూడదని స్పష్టం చేసింది. హెల్త్ ఎడ్యుకేషన్ పేరుతో జరుగుతున్న డిజిటల్ మార్కెటింగ్ గేమ్‌కు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ నూతన మార్గదర్శకాలను తీసుకొచ్చింది.

 వైద్య రంగంలో వినియోగించే ‘100శాతం నయం’, ‘గ్యారంటీడ్ రిజల్ట్స్’, ‘పర్మనెంట్ సొల్యూషన్’ వంటి ప్రకటనలను NMC పూర్తిగా నిషేధించింది. ఆస్పత్రులు లేదా వైద్యులు తమ వద్ద ఉన్న మెడికల్ పరికరాలు, అందుబాటులో ఉన్న సేవల వివరాలను పంచుకోవచ్చు కానీ, తమ ట్రీట్‌మెంట్ అందరికంటే శ్రేష్ఠమైనదని లేదా కచ్చితమైన ఫలితాలు ఇస్తుందని క్లెయిమ్ చేయకూడదు. పేషెంట్ల నుండి పొందే రివ్యూలు, 'బిఫోర్ అండ్ ఆఫ్టర్' ఫోటోలు, డిజిటల్ టెస్టిమోనియల్స్‌ను ప్రమోషన్ల కోసం వాడుకోవడంపై కఠిన ఆంక్షలు విధించింది.

 ఏఐ (AI) ద్వారా రూపొందించిన డాక్టర్ అవతార్లు, ఫేక్ వాయిస్‌లు, కల్పిత పేషెంట్ కథనాలతో ప్రచారాలు నిర్వహించినా చట్టపరమైన చర్యలు తప్పవని కమిషన్ హెచ్చరించింది. అంతేకాకుండా, డాక్టర్లు స్వయంగా కాకుండా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సర్లు లేదా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీల ద్వారా చెల్లింపులు జరిపి ప్రచార రీల్స్ చేయించినా, దానికి సంబంధిత డాక్టర్ లేదా హాస్పిటల్ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 'పేషెంట్ అనుమతి ఉంది కదా' అని బిజినెస్ ప్రమోషన్లు చేయడం ఇకపై చెల్లదు.

 సోషల్ మీడియాను వైద్య విజ్ఞానం పెంచడానికి, డయాబెటిస్, గుండెపోటు, మానసిక ఆరోగ్యం వంటి ప్రజా ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించడానికి నిరభ్యంతరంగా వాడుకోవచ్చని NMC స్పష్టం చేసింది. అయితే విజ్ఞాన సమాచారంతో మొదలై చివరికి 'అపాయింట్‌మెంట్ కోసం క్లిక్ చేయండి' అంటూ మార్కెటింగ్ దిశగా సాగే రీల్స్‌పై కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది. వైద్య వృత్తిలో విశ్వసనీయతను కాపాడేందుకే ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చినట్లు వెల్లడించింది.

#NationalMedicalCommission#NMCRules2026#DoctorsOnInstagram#MedicalMarketingRules#HealthEducationVsMarketing#SocialMediaForDoctors#DigitalHealthIndia
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి