తెలంగాణ

HYD : ట్యాంక్ బండ్ మీద పుట్టినరోజు వేడుకలు వద్దు : సీపీ సజ్జనార్

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

హైదరాబాద్‌లో అర్ధరాత్రి వేళ ట్యాంక్ బండ్, సచివాలయం ఎదుట కొందరు సెలబ్రేషన్స్ చేస్తున్నారు. కార్లు, బైకుల మీద వచ్చి కేకు కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటుండంతో అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.దీనికి తోడు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తాజాగా ఈ వేడుకలపై ఘాటుగా స్పందించారు.

హైదరాబాద్‌లో అర్ధరాత్రి వేళ ట్యాంక్ బండ్, సచివాలయం ఎదుట కొందరు సెలబ్రేషన్స్ చేస్తున్నారు. కార్లు, బైకుల మీద వచ్చి కేకు కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటుండంతో అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.దీనికి తోడు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తాజాగా ఈ వేడుకలపై ఘాటుగా స్పందించారు.

ట్యాంక్ బండ్‌ మీద పుట్టిన రోజు సెలబ్రేషన్స్, కేక్ కటింగ్స్ చేయొద్దంటూ తల్లిదండ్రులు, యువతకు పిలుపునిచ్చారు. నగరంలోని ప్రధాన రహదారులు, చెరువులు, పార్కుల వద్ద కూడా రాత్రిళ్లు బర్త్ డే వేడుకలు జరపవద్దన్నారు. సంతోషంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుకలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తుండటంపై ఆయన స్పందించారు. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతుర్లు మరణించిన విషయాన్ని గుర్తుచేశారు.

పుట్టినరోజు నాడు అమ్మాయి చనిపోవడం బాధకరం అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కాపాడేందుకు ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయామని తెలిపారు. సమీప భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టేందుకు పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి ట్యాంక్ బండ్‌పై ప్రమాద స్థలాన్ని పరిశీలించినట్టు పేర్కొన్నారు.

అక్కడ జరుగుతున్న ప్రమాదాలపై వివిధ ప్రభుత్వ విభాగాలతో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించినట్టు వెల్లడించారు. పుట్టినరోజును కుటుంబసభ్యుల నడుమ, సురక్షితమైన ప్రదేశాల్లో జరుపుకోవాలని స్పష్టంచేశారు.ట్యాంక్‌బండ్‌పై ఇలాంటి వేడుకలు నిర్వహించడం నిబంధనల ప్రకారం పూర్తిగా నిషేధమని తెలిపారు. ట్యాంక్ బండ్ మీద వేడుకలపై జీహెచ్‌ఎంసీ గతంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇకపై ఎవరూ అర్ధరాత్రి వేళల్లో ట్యాంక్‌బండ్, చెరువులు, బహిరంగ ప్రదేశాల వద్దకు వచ్చి సంబురాలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

#Cp sajjanar#hyderabad#police commisioner#birthday celebrations#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి