International

కర్ణాటక రాజకీయం హీట్.. మంత్రులపై స్టింగ్ ఆపరేషన్ల కుట్ర?

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

కర్ణాటక రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్లు (Sting Operations) ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేబినెట్‌లోని ముఖ్యమైన మంత్రులను లక్ష్యంగా చేసుకుని రహస్యంగా నిఘా పెట్టడం, స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించే కుట్రలు జరుగుతున్నాయంటూ ఏకంగా సీఎం ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 కర్ణాటక రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్లు (Sting Operations) ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేబినెట్‌లోని ముఖ్యమైన మంత్రులను లక్ష్యంగా చేసుకుని రహస్యంగా నిఘా పెట్టడం, స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించే కుట్రలు జరుగుతున్నాయంటూ ఏకంగా సీఎం ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామంపై కేంద్ర మంత్రి, జేడీఎస్ (JDS) అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి తీవ్రంగా మండిపడుతూ, ఇది డీకే శివకుమార్ ఆడుతున్న రాజకీయంలో భాగమేనంటూ తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగారు.

 ఈ వారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం డీకే శివకుమార్ ఐదుగురు మంత్రులను ప్రత్యేకంగా హెచ్చరించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ప్రైవేటు సమావేశాలు, వ్యక్తిగత భేటీల వేళ తీవ్ర అప్రమత్తతతో ఉండాలని, ఏ క్షణంలోనైనా రహస్య రికార్డింగ్‌లు జరిపే ప్రమాదముందని సూచించారు. ఢిల్లీ నుంచి వచ్చిన కొన్ని ప్రత్యేక ప్రైవేట్ ఏజెన్సీలు, బీజేపీ-జేడీఎస్ కూటమి నేతల సాయంతో కాంగ్రెస్ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ఈ తరహా ప్లాన్ చేస్తున్నాయని ఆయన ఆరోపించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

 అంతేకాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ (ED), ఐటీలు తమ పార్టీకి చెందిన 40 మందికి పైగా ఎమ్మెల్యేలు, మంత్రులపై కన్నువేశాయని డీకే గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, డీకే ఆరోపణలను హెచ్‌డీ కుమారస్వామి పూర్తిగా తోసిపుచ్చారు. మంత్రులపై ఆధిపత్యం చెలాయించేందుకు, తన నియంత్రణలో ఉంచుకునేందుకే శివకుమార్ ఈ స్టింగ్ కథనాలను వండివారుస్తున్నారని మండిపడ్డారు.

 గతంలో సిద్ధరామయ్యను ఇరకాటంలో పెట్టేందుకే ఇలాంటి వ్యూహాలను ఉపయోగించారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కర్ణాటకలో స్టింగ్ ఆపరేషన్ల అంశం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష ఎన్డీయే (NDA) కూటమి మధ్య తీవ్ర రాజకీయ పోరుకు దారితీసింది. అధికారాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ జాగరూకతతో అడుగులు వేస్తుంటే, స్టింగ్ ఆరోపణలు కేవలం పొలిటికల్ గిమిక్ మాత్రమేనని ప్రతిపక్షాలు తేల్చిచెబుతున్నాయి.

#DKShivakumar#HDKumaraswamy#KarnatakaPolitics#StingOperationControversy#CongressVsBJP#KarnatakaNews#PoliticalDrama
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి