ఏపీ

Reservations : బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. ఝలక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

బీసీ రిజర్వేషన్ల అంశంలో సుప్రీంకోర్టు మరోసారి సంచలన తీర్పు వెలువరించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఈ విషయంలో ఏపీ హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది.

బీసీ రిజర్వేషన్ల అంశంలో సుప్రీంకోర్టు మరోసారి సంచలన తీర్పు వెలువరించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఈ విషయంలో ఏపీ హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు కల్పించిన 34 శాతం రిజర్వేషన్ల జీవోలను రద్దు చేస్తూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సరైనదే అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్‌ను దేశఅత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.

బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయస్థానంలో వాడీవేడిగా వాదనలు జరిగాయి. క్షేత్రస్థాయి జనాభా లెక్కలు, ఎంపిరికల్ డేటా ఆధారంగానే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించామని, స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కలుగజేసుకున్న ధర్మాసనం.. రాజ్యాంగబద్ధమైన 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్‌ను అస్సలు దాట కూడదని తేల్చి చెప్పింది.

ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది. కాగా, ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. దీంతో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించి లబ్ది పొందాలని భావించిన కూటమి సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

ఇదిలాఉండగా, బీసీలకు 34 శాతం రిజర్వేషన్స్ కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో వలన.. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రతిపాదించిన 50 శాతం గరిష్ట పరిమితిని దాటుతున్నాయని ఆరోపిస్తూ గతంలో హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ధర్మాసనం.. 50 శాతం నిబంధనను ఉల్లంఘిస్తూ బీసీలకు 34 శాతం కోటా అమలు చేయడం కుదరదని స్పష్టం చేస్తూ ఆ రిజర్వేషన్ల జీవోలను రద్దు చేసింది.కాగా, గతంలో తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఎదురవ్వగా ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరిగాయి.ఏపీలోనూ ప్రస్తుతం అదే సీన్ రిపీట్ కానుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

#Ap government#BC reservations#Supreamcourt#Politics#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి