తెలంగాణ

TG : రేవంత్‌ సొంత జిల్లాలో ఫుడ్ పాయిజన్.. బుద్ధితెచ్చుకోని సర్కార్!

రచన: Kumar••6 నిమిషాల పఠనం

రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కలుషిత ఆహారం తిని సాంఘీక సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు.ఫుడ్ పాయిజన్‌తో పలువురు విద్యార్థులు మరణించిన ఘటనలు కూడా రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి.

రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కలుషిత ఆహారం తిని సాంఘీక సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు.ఫుడ్ పాయిజన్‌తో పలువురు విద్యార్థులు మరణించిన ఘటనలు కూడా రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి.అయినప్పటికీ సర్కార్ తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

తాజాగా సీఎం రేవంత్‌ రెడ్డి సొంత జిల్లా పాలమూరులో ఫుడ్ పాయిజన్‌ జరిగింది.ఈ ఘటనలో 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.నొప్పి తట్టుకోలేక విద్యార్థినులు కంటతడి పెట్టుకుని విలవిల్లాడారు.బుధవారం రాత్రి ఘటన జరిగితే వీడియోలు బైటికి రాకుండా అధికార పార్టీ నేతలు తొక్కి పెట్టే ప్రయత్నం చేసినట్టు సమాచారం.

పెబ్బేరు పట్టణ శివారులోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలలోని హాస్టల్ విద్యార్థులు మొన్న రాత్రి డిన్నర్‌లో చికెన్ తిన్నారు. కాసేపటికే దాదాపు 40-50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.దీంతో స్టూడెంట్స్‌ను వార్డెన్ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు వైరల్‌ ఫీవర్‌ వచ్చిందని వార్డెన్‌,ఆస్పత్రి వైద్యులు నమ్మించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. విషయం తెలియడంతో పిల్లల తల్లిదండ్రులకు ఆస్పత్రి వద్దకు పరుగులు తీసినట్టు తెలిసింది.

2024లో ఫుడ్ పాయిజన్ ఘటనలు..

ఇదిలాఉండగా, 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలు ఇలా ఉన్నాయి. అదే ఏడాది ఏప్రిల్ నెలలో భువనగిరిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో కలుషిత ఆహారం తిని ఆరో తరగతి చదువుతున్న ఒక బాలుడు మృతి చెందగా, పలువురు విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. అదే నెలలో జనగాం కస్తూర్బా గాంధీ విద్యాలయం కలుషిత ఆహారం కారణంగా 16 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ ఏడాది మొత్తంలో వివిధ ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనల వల్ల 400 మందికి పైగా విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.

2025లో చూసుకుంటే...

ఇక 2025లో గురుకులాలు, గిరిజన పాఠశాలల్లో (జూలై - డిసెంబర్) మధ్య కాలంలో 150కు పైగా ప్రాంతాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకున్నాయి. పురుగులు పట్టిన అన్నం, నాణ్యత లేని క్యాటరింగ్ వల్ల దాదాపు 2000 మందికి పైగా విద్యార్థినీవిద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. రెసిడెన్షియల్, గురుకుల పాఠశాలల్లో పదే పదే జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్, మరణాల ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినా పరిస్థితిలో మాత్రం ఏమార్పు రాలేదు.

2026లోనూ ఆగని ఘటనలు

ఈ ఏడాదిలో జూలైలో నాగర్‌కర్నూల్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 27 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. మానవ హక్కుల కమిషన్ (HRC) మరోసారి సుమోటోగా కేసు స్వీకరించింది. ఆ తర్వాత ఆగస్టు నెలలో వరంగల్ గిరిజన ఆశ్రమ పాఠశాల కిచిడి తిన్న తర్వాత 25 నుంచి 27 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సెప్టెంబర్ నెలలో సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దలోడి ZP హైస్కూల్‌లో మిగిలిపోయిన ఆహారాన్ని విద్యార్థులకు వడ్డించడం వల్ల సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.కళ్ల ముందే ఇన్ని ఘటనలు జరుగుతున్నా రేవంత్ సర్కార్ మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదని అటు విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖను సీఎం తన వద్దే ఉంచుకున్నా విద్యార్థులు అరిగోస పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

#Food poison#Gurukula schools#government#cm revanth reddy#swechaannews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి