తెలంగాణ

BRS : రేవంత్ రెడ్డిది పంది కంటే హీనమైన బతుకు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

రచన: Kumar4 నిమిషాల పఠనం

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి నిన్న మూసారాం బ్రిడ్జి ప్రారంభోత్సవంలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘కేసీఆర్‌కు నాకు నందికి, పందికి ఉన్న తేడా ఉంది. గాడిదకు ఎంత రంగు పూసినా అది రేసుగుర్రం కాదు’ అని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి నిన్న మూసారాం బ్రిడ్జి ప్రారంభోత్సవంలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘కేసీఆర్‌కు నాకు నందికి, పందికి ఉన్న తేడా ఉంది. గాడిదకు ఎంత రంగు పూసినా అది రేసుగుర్రం కాదు’ అని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

‘రేవంత్ రెడ్డిది పంది కంటే హీనమైన బతుకు. వెలిగొండ ప్రాజెక్టు గురించి, కృష్ణా జలాల దోపిడి గురించి మాట్లాడేందుకు ఎందుకు ఉచ్చ పడుతుంది రేవంత్ రెడ్డికి, మంత్రులకు? నీకు రాజకీయ బిక్ష పెట్టిన పాలమూరుకు ఇంత ద్రోహం చేస్తావా, మళ్లీ వలసల జిల్లాగా మారుస్తావా? తెలంగాణకు సమైక్య వాదుల కంటే ఎక్కువ ద్రోహం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇంకా సిగ్గులేకుండా కేసీఆర్ గురించి ఎలా మాట్లాడుతున్నావు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ బయటకు రావడం లేదని, ఆయన లేరని రేవంత్ రెడ్డి అంటున్నారని, కేసీఆర్ లేకపోతే ముఖ్యమంత్రి ఆయన గురించి ఎందుకు పదే పదే మాట్లాడతారని ప్రశ్నించారు. కేసీఆర్ ఎక్కడో లేడని మీ గుండెల్లోనే ఉన్నాడని పేర్కొన్నారు. రేవంత్ వెయ్యి రోజుల పాలనలో వెయ్యి క్షణాలైనా కేసీఆర్ పేరు తలుచుకోకుండా ఉన్నారా? అని మాజీ మంత్రి ప్రశ్నించారు. దీనిని బట్టి కేసీఆర్ ఎల్లప్పుడూ ఉన్నారని అర్థం చేసుకోవచ్చన్నారు. కేసీఆర్ మీ చుట్టే ఉన్నారని, ప్రతి గులాబీ కండువలోనూ ఆయన ఉన్నారన్నారు. కేసీఆర్ పనిచేస్తున్నందునే రేవంత్ రెడ్డికి వణుకు పుడుతోందన్నారు.

మిర్యాలగూడలో రైతు నిరసన సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపైనా జగదీశ్వర్ రెడ్డి స్పందించారు.మిర్యాలగూడలో రైతు ధర్నా జరిగి తీరుతుందని స్పష్టంచేశారు. ధర్నాకు కేటీఆర్ కూడా హాజరవుతారని,కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు.రేవంత్ రెడ్డి సర్కారుకు భయం పట్టుకుందని, అందుకే ధర్నాకు అనమతి నిరాకరించారని వెల్లడించారు.

https://x.com/TeluguScribe/status/2094682775546695747?s=20

#BRS#congress#jagadish reddy#cm revanth reddy#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి