సినిమా

MYSAA: రష్మిక మందన్న మూవీ రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్

రచన: Anshu4 నిమిషాల పఠనం

MYSAA: నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న ఫీమేల్ సెంట్రిక్ మూవీ మైసా. తాజాగా ఈ సినిమా నుంచి సరికొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో, ఈ మూవీ విడుదల తేదీని కూడా కన్‌ఫర్మ్ చేశారు. ఇప్పటి వరకూ చేయని ఓ ఛాలెంజింగ్ రోల్‌లో రష్మిక నటిస్తోంది. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో 2026 నవంబర్ 27న విడుదల కాబోతోంది.

ఛలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చిన రష్మిక మందన్న, అతికొద్దికాలంలోనే అగ్ర కథానాయికగా పాపులర్ అయింది. ఇక, అల్లు అర్జున్ నటించిన పుష్ప సిరీస్‌తో పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ తెచ్చుకుంది. అదే సమయంలో చేసిన అనిమల్ సినిమా బాలీవుడ్‌లోనూ విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇలా, వరుసగా భారీ చిత్రాల్లో నటించిన రష్మిక, మధ్యలో ప్రయోగాత్మక చిత్రాలను ఒప్పుకుంది.

ది గర్ల్ ఫ్రెండ్, కుబేర అలాంటి సినిమాలే. ఈ సినిమాలలో రష్మిక నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం, ఆమె చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో భర్త విజయ్ దేవరకొండతో చేస్తున్న రణబాలి ఒకటి. ఈ సినిమాను అక్టోబర్ 16న రిలీజ్ చేయనున్నారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమా. అలాగే, అల్లు అర్జున్ తో చేస్తున్న రాకా పాన్ వరల్డ్ మూవీ. వచ్చే ఏడాది అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక, లేడి ఓరియెంటెడ్ మూవీగా రూపొందుతున్న మైసా నవంబర్ 27న 2026 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు తాజాగా కొత్త పోస్టర్ ద్వారా ప్రకటించారు. కాగా, అన్ ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై అజయ్ సాయిపురెడ్డి, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోప కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రష్మిక నడుముకి గాయం అయింది. దాదాపు, 6 వారాల విశ్రాంతి తర్వాత మళ్ళీ తిరిగి ఈ నెల నుంచి షూటింగ్స్ లో జాయిన్ కాబోతోంది.

#Rashmika Mandanna#Mysaa#Mesaa Release Date#Raveendra Pulle
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి