తెలంగాణ

Vemula Prashanth Reddy: కవిత నిర్వాకంతో కేసీఆర్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు- వేముల ప్రశాంత్ రెడ్డి

రచన: NK7 నిమిషాల పఠనం

Vemula Prashanth Reddy: టీఆర్ఎస్ చీఫ్ కవిత తన గురించి చేసిన విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తనపై కవిత చేసిన ఆరోపణలను వేముల ప్రశాంత్ రెడ్డి ఖండించారు. కష్టకాలంలో ఉన్న కేసీఆర్ ను వదిలేసి వెళ్లింది కవితే.. నేను కాదు అని ప్రశాంత్ రెడ్డి చెప్పారు.

Vemula Prashanth Reddy: టీఆర్ఎస్ చీఫ్ కవిత తన గురించి చేసిన విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తనపై కవిత చేసిన ఆరోపణలను వేముల ప్రశాంత్ రెడ్డి ఖండించారు. కష్టకాలంలో కేసీఆర్ ను వదిలేసి వెళ్లింది కవితే.. నేను కాదు అని ప్రశాంత్ రెడ్డి చెప్పారు.

కవిత ఆరోపణలు నిరాధారం

కేసీఆర్ ప్రధాన అనుచరులను టార్గెట్ చేస్తూ అధికార పార్టీకి కవిత పరోక్షంగా సాయపడుతున్నారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కవిత నిర్వాకంతో ఆమె తండ్రి కేసీఆర్ తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారని ప్రశాంత్ రెడ్డి వాపోయారు. రేవంత్ సర్కార్ వైఫల్యాలపై తాను పోరాటం చేస్తూనే ఉన్నానని తెలిపారు. తాను కాంగ్రెస్ తో సంప్రదింపులు జరిపానని కవిత చెప్పడం పూర్తిగా అవాస్తవం అన్నారు. తనపై కవిత చేసిన ఆరోపణలు అర్థరహితం, నిరాధారం అని చెప్పారు. కవిత కాంగ్రెస్ నేతలను రహస్యంగా కలిశారా? లేదా? వారితో సంప్రదింపులు జరిపారా? లేదా? అన్న విషయం చెప్పగలరా అని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.

తండ్రినే తిట్టిన ఆమెకు నేనొక లెక్కా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం లింబాద్రి గుట్ట నర్సింహ స్వామిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నిన్న కవిత చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. కవిత మొండిగా వ్యవహరించారు, పార్టీ లైన్ దాటారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. తాను మొదటి నుంచి పార్టీలోనే ఉన్నానని తెలిపారు. కవితనే మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లిపోయారని విమర్శించారు. తండ్రినే దుర్భాషలాడిన కవితకు తనను తిట్టడం ఒక లెక్కా అని వ్యాఖ్యానించారు. ఆమె ఎవరికి లాభం కలిగిస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు.

కష్టకాలంలో కేసీఆర్ ను వదిలి వెళ్లింది మీరా? నేనా?

''ప్రశాంత్ రెడ్డియే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీయే ప్రశాంత్ రెడ్డి. నేను మంతనాలు చేశానని కవిత అంటున్నారు. మరిప్పుడు కష్టకాలంలో కేసీఆర్ కు అండగా ఉన్నది ప్రశాంత్ రెడ్డియా? లేక వదిలి వెళ్లిపోయిన కవితా? ఇవాళ అసెంబ్లీలో, అసెంబ్లీ బయట, జిల్లాలో రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత 33 నెలలుగా పోరాటం చేస్తున్నది ప్రశాంత్ రెడ్డియా? కవితనా? ఇది అందరికీ తెలుసు.

కాంగ్రెస్ వాళ్లను రహస్యంగా కలిశారా? లేదా?

కాంగ్రెస్ లో చేరేందుకు నేను మంతనాలు జరిపాను అని కవిత అన్నారు. నేను కాంగ్రెస్ లో చేరేందుకు ఎవరితోనూ మంతనాలు జరపలేదు. నాకు ఆ అవసరం లేదు, నాకా అగత్యమూ లేదూ. లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఈ మాట చెబుతున్నా. కవిత కూడా రహస్యంగా కాంగ్రెస్ వాళ్లను కలిశారా లేదా అన్న విషయం చెప్పగరలా? కవిత నాపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. తన లాభం కోసం ఎదుటి వారి అజెండాను అమలు చేస్తున్నారు.

కేసీఆర్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు

ఒక వ్యక్తి ప్రతిష్టని దిగజార్చే ప్రయత్నం చేయడం మంచిది కాదు. కవిత జనం ముందు కన్నీళ్లు పెట్టుకోవడం రాజకీయం. సింపతీ కోసమో మరో దాని కోసమో తెలీదు. అది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా. కవిత చేసే ఈ పనుల వల్ల, ఈ వ్యవహారాల వల్ల ఆమె తండ్రి కేసీఆర్ ఎంత మనోవేదనకు గురవుతున్నారో ఒక బిడ్డగా మీరు ఎప్పుడూ ఆలోచించలేదు. ఎంత మౌన రోదనకి ఆయన గురవుతున్నారో ఆయన బిడ్డగా మీరు ఆలోచన చేయడం లేదు. అది చాలా బాధాకరం'' అని వేముల ప్రశాంత్ రెడ్డి వాపోయారు.

హరీశ్ నైనా క్షమిస్తా ప్రశాంత్ రెడ్డిని మాత్రం వదలా

కాగా, టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభలో కవిత మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తండ్రిని, బిడ్డను వేరు చేయడంలో ప్రధాన పాత్ర ప్రశాంత్ రెడ్డిది అని కవిత ఆరోపించారు. మహా భారతంలో శకుని లాంటి పాత్ర ఈ ప్రశాంత్ రెడ్డిది అని తీవ్ర విమర్శలు చేశారు. హరీశ్ రావునో, సంతోష్ రావునో క్షమిస్తాను కానీ ప్రశాంత్ రెడ్డిని మాత్రం వదిలేది లేదన్నారు. ఆయనకు తన ఉసురు తగులుతుందన్నారు.

గంజాయి డబ్బుతో ఏదో ఒక విధంగా ఎన్నికల్లో గెలిచిన ప్రశాంత్ రెడ్డికి.. ఇక ప్రజా జీవితం లేదన్నారు కవిత. బాల్కొండ నుంచి ప్రశాంత్ రెడ్డి పారిపోవాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసినా ప్రశాంత్ రెడ్డిని టీఆర్ఎస్ ఓడిస్తుందని కవిత అన్నారు. ప్రజల దయతో అందరినీ గెలిపించేందుకు తాను కష్టపడితే.. అందరూ కలిసి తనను ఓడగొట్టారని కవిత వాపోయారు.

#Vemula Prashanth Reddy#Brs#Trs#Kavitha#Kcr#Telangana Politics#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి