RC 17: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఆర్సీ 17కి సన్నాహాలు జరుగుతున్నాయి. దాదాపుగా ఈ ప్రాజెక్ట్‌కి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ మొత్తం ఓ కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్-సుకుమార్ రైటింగ్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్న ఈ సినిమాను పవర్ ప్రాజెక్ట్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నాడు సుకుమార్. తాజా సమాచారం మేరకు చరణ్-సారా అర్జున్‌ల లుక్ టెస్ట్ పూర్తైనట్టుగా తెలుస్తోంది.
రంగస్థలం కాంబోకి భారీ క్రేజ్:
రంగస్థలం లాంటి భారీ హిట్ తర్వాత మళ్ళీ ఇంతకాలానికి రామ్ చరణ్, సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి చేయబోతున్న ఈ పవర్ ప్రాజెక్ట్‌కి సంబందించిన బిజినెస్ వ్యవహారాలను కూడా పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ విదేశాలలో ఈ సినిమా షూటింగ్ కోసం లొకేషన్స్ కూడా ఫైనల్ చేశారు. దాదాపు నెలరోజుల పాటు రామ్ చరణ్-సుకుమార్ కలిసి విదేశాలలో పర్యటించి లొకేషన్స్ ఫైనల్ చేశారు. ఇక, ఇప్పటి వరకూ రాని ఓ అద్భుతమైన కథతో RC 17 రూపొందనుంది.
రామ్ చరణ్-సారా అర్జున్‌ల లుక్ టెస్ట్ కంప్లీట్:
RC 17 కోసం పలు రకాల గెటప్స్‌ను రామ్ చరణ్, సారాలతో నిర్వహించి ఫైనల్‌గా ఒకటి ఫైనల్ చేశారట. ప్రాజెక్ట్ ఇంకా పూజా కార్యక్రమాలతో ప్రారంభించకపోవడానికి కారణం ఇందులో ఆయన మేకోవర్ ఫైనల్ కాకపోవడమే. మొత్తానికి ఆ పని కూడా పూర్తైందట. పెద్ది సినిమా కోసం పెంచిన పొడవాటి జుట్టునే మరో స్టైల్‌లో RC 17 కోసం మార్చారట. నవంబర్‌లోనే ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసి రెగ్యులర్ షీట్ మొదలుపెట్టబోతున్నారు. ఏడాదిలోపే సినిమాను పూర్తి చేసి 2027 చివరికల్లా పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేసేందుకు పక్కా ప్లాన్‌తో పట్టాలెక్కిస్తున్నారు.
RC 17లో హీరోయిన్‌గా ‘ధురంధర్’ ఫేమ్ సారా అర్జున్!
ఇటీవల వచ్చిన బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ‘ధురంధర్’ ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. చాలా ఏళ్ళ తర్వాత హిందీలో ఈ రేంజ్ హిట్ దక్కడం విశేషం. ఇక, ఈ సినిమాతో బాగా ఫేమ్ సంపాదించిన సారా అర్జున్ RC 17లో చరణ్ సరసన హీరోయిన్‌గా ఎంపిక చేశారట. అలాగే, మ్యూజిక్ డైరెక్టర్‌గా జీవీ ప్రకాష్ కుమార్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇదే, జరిగితే సుకుమార్, దేవిశ్రీప్రసాద్ కలయికలో చేయని ఫస్ట్ మూవీగా RC 17 నిలుస్తుంది.


