TG: దాదాపు నెల రోజుల తర్వాత భాగ్యనగరాన్ని వరుణుడు ఒక్కసారిగా ముంచెత్తాడు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుండటంతో రోడ్లన్నీ క్షణాల్లో జలమయమయ్యాయి. సాయంత్రం వేళ అకస్మాత్తుగా కురిసిన కుండపోత వానతో ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కాప్రా, ఘట్‌కేసర్, బోడుప్పల్, మేడిపల్లి, చర్లపల్లితో పాటు ఐటీ కారిడార్ పరిధిలోని నానక్‌రామ్‌గూడ, మణికొండ, అటు టోలిచౌకి, షేక్‌పేట్ ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ప్రధాన రహదారులపైకి నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి.
మరికాసేపట్లో ఆ ప్రాంతాల్లోనూ కుండపోత..
వర్షం మరింత విస్తరిస్తుండటంతో పలు కీలక ప్రాంతాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మరికొద్ది సేపట్లో సికింద్రాబాద్, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, హయత్‌నగర్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.


