సినిమా

Akhil Akkineni: లెనిన్ సక్సెస్‌తో భయపడుతున్న అక్కినేని హీరో!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Akhil Akkineni: ఇమెజ్ కాపాడుకోవడం అందరు హీరోల వల్లా, దర్శకుల వల్లా కాదు. దీనికోసం చాలా ఛాలెంజెస్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా హిట్ ఉన్నప్పుడే క్రేజ్ ఉంటుంది తప్ప. ఫ్లాప్స్ వస్తుంటే అప్పుడే, రిజక్షన్స్ మొదలవుతాయి. కృష్ణ వంశీ, వినాయక్ లాంటి అగ్ర దర్శకులు ఇప్పుడు సైలెంట్‌గా ఉండటానికి కారణం ఇలాంటి రిజక్షన్సే. ఇప్పుడు, అక్కినేని హీరో అఖిల్ కూడా ఈ విషయంలోనే కాస్త భయపడుతున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

లెనిన్స్ సక్సెస్ లాభమా..నష్టమా:

ఏ హీరోకైనా సక్సెస్ తెచ్చే పేరును కాపాడుకోవడం కత్తి మీద సాము. ఫ్లాప్స్ ఉన్నంతకాలం ఒక టెన్షన్ ఉంటే ఒక హిట్ వచ్చాక ఆ టెన్షన్ ఇంకోలా ఉంటుంది. అఖిల్ కెరీర్‌లో మొదటి సినిమా అఖిల్ డిజాస్టర్. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ యావరేజ్ టాక్ వరకూ ఓకే గానీ..భారీ హిట్‌గా నిలిచింది మాత్రం లేదు. ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో లెనిన్ సినిమాతో హిట్ కొట్టాడు అఖిల్.

ఇక్కడి వరకూ బాగానే ఉంది. కానీ, ఇప్పుడు అసలు ఛాలెంజ్ ఎదురైంది ఈ అక్కినేని హీరోకి. లెనిన్ తర్వాత ఎలాంటి కథ చెయ్యాలి..ఏ దర్శకుడితో సినిమాను కమిటవ్వాలి...అనే మానసిక సంఘర్షణలో అఖిల్ ఉన్నట్టుగా తెలుస్తోంది. లేక లేక... రాక రాక ఒక హిట్ వచ్చింది. దాన్ని, కాపాడుకోవాలంటే ఖచ్చితంగా తరువాత చేయబోయో సినిమా కథ, దాన్ని తెరమీదకి తీసుకువచ్చే దర్శకుడి విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది.

తండ్రి నాగార్జున ఉన్నా ఛాలెంజ్ తప్పదు:

అఖిల్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కినేని నాగార్జున అగ్ర నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త. అయినా, అఖిల్ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి ఇన్నేళ్ళు పట్టింది. అందుకే, అఖిల్ నెక్స్ట్ సినిమాపై చాలా ప్లానింగ్ ఉందట. అఖిల్ కూడా చైతూ మాదిరిగా నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి తొందరపాటు లేకుండా కూల్‌గా కథలను వింటున్నాడట. సుప్రియ, నాగార్జునలు కథ ఫైనల్ చేస్తేనే ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. ఇందులో, ఎలాంటి సందేహము అవసరం లేదు.

#Akhil Akkineni#Lenin Movie#Tollywood#Akhil Next Movie Updates
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి