సినిమా

Nithya Menen: డబ్బు కోసం కాదు..కథ నచ్చితేనే చేస్తా!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Nithya Menen: కథ, అందులో తన పాత్ర నచ్చితేగానీ సినిమాకి సైన్ చేయని అతికొద్దిమంది హీరోయిన్స్‌లో నిత్య మేనన్ ఒకరు. రెమ్యునరేషన్ కోసం ఈ బ్యూటీ ఎప్పుడు సినిమాను ఒప్పుకోలేదు. నిత్యా హీరోయిన్, సింగర్. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో దాదాపు యాభై చిత్రాలకు పైగా నటించింది. పాత్ర నచ్చి కొన్ని సినిమాలలో కీలక పాత్రలు కూడా చేసింది. ఆ సినిమాలు సన్నాఫ్ సత్యమూర్తి, గీత గోవిందం. మూడు సౌత్ ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, రెండు నంది బహుమతులు అందుకుంది.

నిత్యా మేనన్ 8 సంవత్సరాలప్పుడే "ద మంకీ హు న్యూ టూమచ్" (1998) అనే ఇంగ్లీష్ మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. 17 ఏళ్ళప్పుడు ఒక కన్నడ సినిమాలో కీలక పాత్ర పోషించింది. దీని తర్వాత ఆకాశ గోపురం అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా నటించే అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించింది నిత్యా. తెలుగులో బాగా గుర్తింపు తెచ్చిన సినిమా అలా మొదలైంది.

గుండెజారి గల్లంతైయ్యిందే, ఇష్క లాంటి సినిమాలతో బాగా క్రేజ్ వచ్చింది. కానీ, ఆ క్రేజ్‌ను కమర్షియల్ సినిమాలకు నిత్యా ఉపయోగించుకోలేకపోయింది. హీరోతో రొమాన్స్, లిప్ లాక్ లాంటి సన్నివేశాలకి ఒప్పుకోలేదు. కథ బలంగా ఉండి తన పాత్ర క్లీన్‌గా ఉంటే తప్ప హద్దులు దాటి అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఆకట్టుకునే పాత్రలకి సేసేమిరా అంది. అందుకే, పెద్ద బ్యానర్ సినిమాలొచ్చినా సింపుల్‌గా రిజెక్ట్ చేసింది.

పవన్ కళ్యాణ్ సరసన భీంలా నాయక్ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ నిత్యా తెలుగు సినిమాలలో నటించలేదు. నిత్యా పర్ఫార్మెన్స్‌కి ఇప్పట్లో స్క్రీన్‌కి దూరంగా ఉండాల్సింది కాదు. కానీ, ఆమె పెట్టుకున్న కొన్ని కండీషన్స్ వల్ల ఎక్కువ సినిమాలను చేయడం లేదు. దర్శకురాలు నందినీ రెడ్డి నిత్యాకి చాలా క్లోజ్. అయినా, సినిమాల పరంగా మాత్రం ఆ క్లోజ్‌నెస్‌ను వాడుకోవడం లేదు. సహజమైన నటనతో ఆకట్టుకునే అతికొద్ది మంది నటీమణుల్లో నిత్యా ముందు వరుసలో ఉంటుంది. కానీ, ఆమె ఎందుకనో కమర్షియల్ సినిమాలకి దూరంగా ఉంది.

#Nithya Menen#Actress Nithya Menen#Tollywood#Ala Modalaindhi. Ishq
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి