యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ కస్టడీ పిటిషన్‌పై గన్నవరం కోర్టులో నేడు కీలక విచారణ జరగనుంది. ఉపా (UAPA) చట్టం అరెస్టు అయన రావణ్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలోనే కస్టడీ పిటిషన్‌పై రావణ్ తరఫు న్యాయవాదులు సైతం కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాలు, ప్రశ్న రావణ్ ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఆయన భార్య ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను సైతం పోలీసులు రికార్డు చేశారు. రావణ్ ఆర్థిక లావాదేవీలు, సోషల్ మీడియా ఖాతాల నిర్వహణపై సమగ్ర విచారణ అవసరమని భావించిన పోలీసులు.. గన్నవరం కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.ప్రశ్న రావణ్ కస్టడీ పిటిషన్‌లో పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెట్టారు.భారత ప్రభుత్వంపై సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వీడియోలు రూపొందించారని, దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగించేలా మాట్లాడారని ఆయనపై తీవ్ర అభియోగాలను పోలీసులు మోపారు.
ఇకక నిషేధిత ఉగ్రవాద సంస్థలు, నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా యువతను అటువైపు ప్రోత్సహించేలా కంటెంట్ క్రియేట్ చేసి సోషల్ మీడియా,యూట్యూబ్‌లో వదిలారని ఆరోపించారు. మరోవైపు విద్వేషపూరిత కంటెంట్ వెనుక సహకరించిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, ప్రశ్న రావణ్‌ను గన్నవరం కోర్టు పోలీసుల కస్టడీకి ఇస్తుందా? నిరాకరిస్తుందా? అనేది తెలియాల్సి ఉన్నది.












