తెలంగాణ

congress: అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేయలేరు!..

రచన: Venu3 నిమిషాల పఠనం

ప్రజల మద్దతు పొందుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ఉద్దేశంతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు సింగరేణి బొగ్గు అంశం, కన్నెపల్లి అంశాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు.

రామగుండంలో అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేయలేరని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు. గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిందని, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.

ప్రజల మద్దతు పొందుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ఉద్దేశంతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు సింగరేణి బొగ్గు అంశం, కన్నెపల్లి అంశాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి దోపిడీకి గురిచేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు.

టీబీజీకేఎస్ నాయకుల మెడికల్ దందా వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలోనే విజిలెన్స్ విచారణలు జరిగి అరెస్టులు కూడా జరిగిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదన్నారు. గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రస్తుత ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ నేతల అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. గతంలో గడీల పాలన కొనసాగితే, ప్రస్తుతం ప్రజల కోసం పనిచేసే ప్రజాపాలన కొనసాగుతోందని అన్నారు.

రామగుండం నియోజకవర్గంలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో అనేక కార్యక్రమాలను చేపడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు.

#telangana#Congress#brs#ramagundam#mla rajtaakur#ktr#harish rao
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి