టాప్ న్యూస్

META : ‘వాట్సాప్ యూజర్ నేమ్’ ఫీచర్‌పై మెటా క్లారిటీ.. అలా చేస్తే తప్పక అడ్డుకుంటాం!

రచన: Kumar4 నిమిషాల పఠనం

వాట్సాప్ త్వరలో ‘యూజర్ నేమ్’ ఫీచర్ తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ‘ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్’ వంటి సోషల్ మీడియాల్లో ఎలాగైతే యూజర్ నేమ్ ఖాతా ఉంటుందో అలాగే.. వాట్సాప్‌లోనూ మొబైల్ నెంబర్‌తో

వాట్సాప్ త్వరలో ‘యూజర్ నేమ్’ ఫీచర్ తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ‘ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్’ వంటి సోషల్ మీడియాల్లో ఎలాగైతే యూజర్ నేమ్ ఖాతా ఉంటుందో అలాగే.. వాట్సాప్‌లోనూ మొబైల్ నెంబర్‌తో పనిలేకుండా హైడ్ చేసుకుని కేవలం యూజర్ నేమ్ కనిపించేలా అప్డేట్స్ తీసుకురానుంది. అయితే, వాట్సాప్ యూజర్ నేమ్స్ వలన వ్యక్తిగత గోప్యత దెబ్బతినడం, ఫేక్ ఐడీలు పుట్టుకురావడం, సైబర్ మోసాలు జరిగే ఆస్కారం ఉందని, దీనిపై క్లారిటీ ఇవ్వాలని ఇటీవల కేంద్రప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

కేంద్రం నోటీసులపై మెటా తాజాగా క్లారిటీ ఇచ్చింది.దానిపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్టు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ‘యూజర్ నేమ్’ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదని, ఈ ఏడాది చివర్లో దశలవారీగా అందుబాటులోకి తెస్తామని వాట్సాప్ ప్రతినిధులు కేంద్రానికి వివరించారు.యాప్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి పలు రకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.యూజర్ నేమ్ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫోన్ నంబర్‌ను ఇతరులకు షేర్ చేయకుండానే హైడ్ చేసి చాట్ చేయవచ్చని పేర్కొన్నారు.

కానీ, కొత్త వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఫోన్ నంబర్ తప్పనిసరి అని వెల్లడించారు. కాగా, యూజర్ నేమ్ విషయంలో ప్రభుత్వ సంస్థలు, సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, వెరిఫైడ్ ఖాతాల పేర్లను వాట్సాప్ ముందే రిజర్వ్ చేసినట్టు తెలిపింది. ఆ పేర్లతో ఫేక్ అకౌంట్ల ను ఎవరూ కూడా క్రియేట్ చేయలేరని, ఒక అకౌంట్ నుంచి కొత్తగా ఎంతమందికి మెసేజ్ పంపాలో పరిమితి విధించామని తెలిపింది.

ఒక యూజర్‌ నేమ్‌ను పదే పదే కావాలని సెర్చ్, టైప్ చేసే ప్రయత్నాలనూ అడ్డుకుంటామని కేంద్రానికి వివరించింది. అంతేకాకుండా ఎవరైనా కొత్త యూజర్‌ నేమ్ ద్వారా మెసేజ్ పంపితే.. సదరు అకౌంట్ కొత్తదా? పాతదా? మీ ఇద్దరికీ కామన్ గ్రూపులు ఉన్నాయా? లేదా అది వేరే దేశానికి చెందిన అకౌంటా? అనే వివరాలను సైతం వాట్సాప్ స్క్రీన్‌పై చూపిస్తుందని మెటా ప్రతినిధులు వెల్లడించారు.

#META#Whatsapp username#Indian IT ministry#Clarificaion
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి