సినిమా

Rashmika Mandanna: నెమ్మదిగా కోలుకుంటున్నాను: రష్మిక

రచన: Anshu3 నిమిషాల పఠనం

Rashmika Mandanna: ఇటీవల నడుముకి గాయమై చికిత్స జరగడంతో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటోంది. అయితే, ఆమె ఆరోగ్యం ఎలా ఉందనే విషయాన్ని, తన మేనర్స్ గానీ, భర్త విజయ్ దేవరకొండ గానీ వెల్లడించలేదు. దీంతో కాస్త అభిమానులు కంగారు పడుతున్నారు. రష్మికకి ఎంత పెద్ద గాయమైందో..ఎన్నాళ్లకి బయటకు వస్తుందో అని మాట్లాడుకుంటున్నారు.

దీంతో, స్వయంగా తానే తన హెల్త్ గురించి..గాయం ఎలా జరిగిందో అని తెలిపింది. ఇప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నాను అని సోషల్ మీడియా ద్వారా చెప్పిన రష్మిక..పూర్తిగా కోలుకోవడానికి 6 వారాలైనా పడుతుందని హింట్ ఇచ్చింది. మైసా షూటింగ్ సమయంలో తన నడుముకి గాయం అయినట్టుగా తెలిపింది. ఇంత గాయం, నొప్పితో ఉన్నా కూడా ఫ్యాన్స్ కోసం సరదాగా నవ్వుతూ నాకు గాయం ఎలా జరిగిందో చెప్పాలంటే నేను బయాలజీ టీజర్ అవతారం ఎత్తాలంటూ ఫన్నీగా చెప్పింది.

ఇక, తనకి ఇలా గాయమవడం మూడవసారి అని కూడా గుర్తు చేసుకుంది. ఇలా, మాటి మాటికి గాయాలవుతుంటే చికాకుగా ఉంది. ప్రస్తుత, ఇంటి దగ్గరే ఉండి రెస్ట్ తీసుకుంటున్నాను. అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రెండు సినిమాలలో హీరోయిన్‌గా నటిస్తున్న రష్మిక..రెండు నెలలపాటు వాటికి బ్రేక్ ఇచ్చింది.

ఇక, ఈ రెండు సినిమాలలో ఒకటి తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి చేస్తున్న రణబాలి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మరో సినిమా మైసా. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కాబోతున్నాయి. విశేషం ఏమిటంటే ఈ రెండు సినిమాలను రష్మిక పెళ్లికి ముందే సైన్ చేసింది. పెళ్లి తర్వాత ఇప్పటి వరకూ కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

#RashmikaMandanna#Rashmika MandannaInjury#Mysa#Ranabali
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి