International

Earthquakes: వెనిజువెలాలో భూకంపాల బీభత్సం.. 6,125కి చేరిన మృతుల సంఖ్య!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

వెనిజువెలా(Venezuela)లో జూన్ 24వ తేదీన సంభవించిన భారీ జంట భూకంపాలు ఆ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ ప్రకృతి విపత్తు ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇప్పటివరకు 6,125కి చేరినట్లు నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్జ్ అధికారికంగా ధృవీకరించారు.

వెనిజువెలా(Venezuela)లో జూన్ 24వ తేదీన సంభవించిన భారీ జంట భూకంపాలు ఆ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ ప్రకృతి విపత్తు ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇప్పటివరకు 6,125కి చేరినట్లు నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్జ్ అధికారికంగా ధృవీకరించారు. ప్రభావిత ప్రాంతాల్లో శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతుండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భవనాలు నేలమట్టమైన ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. తాజా వివరాల ప్రకారం రక్షణ బృందాలు ఇప్పటివరకు శిథిలాల కింద చిక్కుకున్న 6,462 మందిని సురక్షితంగా కాపాడారు. తీవ్రంగా గాయపడిన సుమారు 60,992 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. యరాకుయ్, లా గైరా రాష్ట్రాల్లో రిక్టర్ స్కేలుపై 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపాల వల్ల లా గైరా తీవ్రంగా నష్టపోయింది.

ప్రమాద తీవ్రతను అంచనా వేయడానికి అధికారులు ఇప్పటివరకు 43,679 భవనాలను పరిశీలించి, వాటిని నివాసయోగ్యమైనవి (గ్రీన్), పరిమిత ప్రవేశం ఉన్నవి (యెల్లో), అత్యంత ప్రమాదకరమైనవి (రెడ్)గా వర్గీకరిస్తున్నారు. ఇప్పటికే ఇళ్లు కోల్పోయిన అనేక కుటుంబాలకు ప్రభుత్వం 287 నూతన గృహాలను కేటాయించింది. మిగిలిన బాధితుల కోసం తాత్కాలిక సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి పునరావాసం కల్పిస్తున్నారు. ఈ కష్టకాలంలో వెనిజువెలాకు అండగా నిలిచేందుకు ప్రపంచవ్యాప్తంగా 28 దేశాలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చాయని యాక్టింగ్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ తెలిపారు.

విదేశాల నుంచి అందిన 2,000 టన్నులకు పైగా ఆహారం, మందులు, ఇతర సహాయక సామగ్రిని వేగంగా బాధితులకు చేరవేస్తున్నామని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకోవడంతో పాటు ధ్వంసమైన మౌలిక సదుపాయాల పునర్నిర్మాణంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. సహాయక చర్యలు పూర్తయిన వెంటనే ప్రభావిత ప్రాంతాలను పూర్వ స్థితికి తీసుకువచ్చేలా సమగ్ర ప్రణాళికను అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

#Venezuela Earthquake#Disasters#Venezuela News#Death Toll#International News#Rescue Operations#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి