Rashmika Mandanna: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవర కొండ, క్యూట్ బ్యూటీ..తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఎపిక్. ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ తాజాగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి ఆనంద్ దేవరకొండ వదిన, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఎపిక్ సినిమా ప్రీమియర్స్‌ను (సెప్టెంబర్ 10) నిర్మాతల కంటే ముందే రివీల్ చేసింది.
బేబీ సినిమాతో క్రేజీ కపుల్‌గా ఆనంద్-వైష్ణవి:
దర్శకుడు సాయి రాజేష్ రూపొందించిన ట్రైయాంగిల్ లవ్ స్టోరీ బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇద్దరూ వేరు వేరుగా ప్రాజెక్ట్స్ చేశారు. కానీ, అవేవి వీళ్ళకి సక్సెస్‌ను ఇవ్వలేదు. మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత ఆనంద్ అండ్ వైష్ణవి కలిసి ఎపిక్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. బేబీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఈ జంట కలిసి చేసిన సినిమాపై సహజంగానే అంచనాలుంటాయి.
ఆ అంచనాలను ఇంకాస్త రెట్టింపు చేసింది ఎపిక్ ప్రమోషనల్ కంటెంట్. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ భారీగా అంచనాలను పెంచాయి. సెప్టెంబర్ 11న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఆదిత్య హాసన్ తెరకెక్కించిన రోమ్ కామ్.. ఓటీటీలో వచ్చిన 90స్ బయోపిక్ కి సీక్వెల్‌గా వస్తోంది. సితార నాగవంశీ ఈ సినిమాను నిర్మించాడు. తాజాగా, ఎపిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి నేషనల్ క్రష్ రష్మిక మందన్న ముఖ్య అథిదిగా హారయ్యారు. ఈ సందర్భంగా ఆమె స్పీచ్ హైలెట్ కావడంతో పాటు ప్రీమియర్స్‌ను కన్‌ఫర్మ్ చేశారు.
సెప్టెంబర్ 10న ఎపిక్ ప్రీమియర్స్:
రష్మిక మందన్న తన మరిది సినిమా గురించి ఇచ్చిన స్పీవ్ ఈవెంట్ మొత్తంలోనే హైలెట్‌గా నిలిచింది. బేబీ కంటే పెద్ద హిట్ కావాలని కోరుకున్న రష్మిక..ఈ సినిమా ప్రీమియర్స్ సెప్టెంబర్ 10న ఉండబోతున్నాయని మేకర్స్ కంటే ముందు రివీల్ చేయడం ఆసక్తికరం. అంతేకాదు, తన మరిది సినిమా పెద్ద హిట్ అవుతుందని చాలా నమ్మకంగా మాట్లాడారు. ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.












