ఏపీ

Tirumala: యాత్రికులతో కిక్కిరిసిన శేషాచలం.. స్వామి వారి దర్శనానికి ఎన్ని గంటలు అంటే?

రచన: Venu4 నిమిషాల పఠనం

తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా పోటెత్తారు. వీకెండ్ కావడంతో దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన యాత్రికులతో శేషాచలం కిక్కిరిసిపోయింది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.

గోవింద నామస్మరణతో ఏడుకొండలు మారుమోగిపోతున్నాయి. ఆపదమొక్కులవాడు, అనాథ రక్షకుడైన ఆ శ్రీవేంకటేశ్వరస్వామి దివ్య దర్శనం కోసం తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా పోటెత్తారు. వీకెండ్ కావడంతో దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన యాత్రికులతో శేషాచలం కిక్కిరిసిపోయింది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.

దీంతో భక్తులు కాలినడక మార్గాలు, బయట ఏర్పాటు చేసిన రింగు రోడ్డు క్యూలైన్లలో గంటల తరబడి వేచివుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి ప్రత్యేక టైమ్ స్లాట్ టోకెన్లు లేకుండా, సాధారణ సర్వదర్శనానికి వస్తున్న భక్తులకు శ్రీవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించేందుకు దాదాపు 20 గంటల సుదీర్ఘ సమయం పడుతోందని సమాచారం.. ఇప్పటికే ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

క్యూలైన్లలో వేచి ఉన్న గోవిందుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పాలు, అల్పాహారాన్ని శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరం అందజేస్తున్నారు. మరోవైపు, నిన్న ఒక్కరోజే 68,374 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే 35,241 మంది భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి స్వామివారి రుణం తీర్చుకున్నారు. ఇక శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు అధికారికంగా వెల్లడించారు.

కొండపై భక్తుల రద్దీ అత్యధికంగా ఉన్న నేపథ్యంలో టీటీడీ అధికారులు యాత్రికులకు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా వృద్ధులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వేచి ఉండే సమయాన్ని బట్టి తమ ప్రయాణ, దర్శన వేళలను ప్లాన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

#Telugu News#AP#Tirumala#Crowd#Darshan Time#Hundi Income#Sri Venkateswara Swamy#devotees
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి