Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తున్న క్రేజీ మూవీ మైసా. ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. నేషనల్ క్రష్ గా పాన్ ఇండియా లెవల్‌లో క్రేజ్ సంపాదించుకున్న రష్మిక..కేవలం గ్లామర్ పాత్రలనే కాదు, పుష్ప లాంటి సినిమాలలో డీగ్లామర్ రోల్స్ చేసి కూడా శభాష్ అనిపించుకుంది. కన్నడ, తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలోనూ మంచి పాపులారిటీని సంపాదించుకుంది.
ఇదే, క్రేజ్ ఆమెకి బాలీవుడ్ లో గొప్ప అవకాశాలు వచ్చేలా చేసింది. హిందీలో రష్మిక నటించిన అనిమల్ ఓ సెన్షేషనల్ హిట్. తెలుగులో పుష్ప ఫ్రాంఛైజీస్ తో ఎలాంటి తిరుగులేని పాపులారీటిని సాధించిందో..అనిమల్ సినిమాతో అలాగే బాలీవుడ్ లోనూ సంపాదించుకుంది. హిందీలో రష్మికకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఛావా లాంటి హిస్టారికల్ సినిమాకి తనే సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.
ఇప్పుడు, తన భర్త విజయ్ దేవరకొండతో రణబాలి సినిమాను చేస్తోంది. అలాగే, పాన్ ఇండియా సినిమాగా మైసా మూవీని చేస్తోంది. ఇందులో, ఈ నేషనల్ క్రష్ ఓ గిరిజన యువతి పాత్రలో కనిపించబోతోంది. ఈ మూవీకోసం తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను సినీ లవర్స్ కి పరిచయం చేయబోతోంది. మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం సాధించిన రష్మిక, మైసా లో భారీ యాక్షన్ సీన్స్ ని కూడా డూప్ లేకుండా చేసిందట.
ఇక, ఈ సినిమాను నూతన దర్శకుడు రవీంద్ర పుల్లే రూపొందించాడు. ఈ మూవీలో మేకప్ లేకుండా నేచురల్ లుక్ లో కనిపించనుంది. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రత్యేకంగా మైసా కోసం రష్మిక చాలా మేకోవర్ అయింది. ఎంతో శ్రమించింది. మరి, ఈ సినిమాతో రష్మిక ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.












