Kajal Aggarwal: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చందమామ గా పాపులర్ అయిన బ్యూటీ కాజల్ అగర్వాల్. మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారింది. ఒకదశలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్‌గా కూడా కాజల్ హాట టాపిక్ అయింది. తెలుగు తో పాటు తమిళంలో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అంతేకాదు, కాజల్ చాలామంది హీరోలకి లక్కీ హీరోయిన్.
హిట్ పేయిర్ గా కూడా కాజల్ అగర్వాల్ ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలో అటు తమిళ ఇండస్ట్రీలో నిలిచింది. ఇదే, కాదు..దర్శకుల, నిర్మాతల హీరోయిన్ అని కూడా చెప్పిన వారు చాలామందే ఉన్నారు. కాజల్ ఏ సినిమాకి రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేదని మాట బాగా వినిపించింది. ఇక, ఒక కథ తన వద్దకు వస్తే సాధ్యమైనంతవరకూ రిజెక్ట్ చేయలేదు.
డేట్స్ సర్దుబాటు చేసి చాలా సినిమాలను ఒప్పుకుంది. అందుకే, ఇండస్ట్రీకొచ్చి దాదాపు 20 ఏళ్ళు అయినా ఇంకా హిందీ, తెలుగు భాషలలో అవకాశాలు అందుకుంటోంది. పెళ్ళి తర్వాత బ్రేక్ తీసుకున్న కాజల్, భవంత్ కేసరి సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తన పర్ఫార్మెన్స్ బావున్నప్పటికీ, ఫిజిక్ పరంగా కొన్ని ట్రోల్స్ ఎదుర్కొంది. వాటికి, స్ట్రాంగ్‌గా కౌంటర్ కూడా ఇచ్చింది.
ఇక, మరోసారి బాలయ్య సరసన NBK 111లో నటిస్తోంది కాజల్. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో తన పాత్ర కాస్త సీరియస్‌గా ఉంటుందని వెల్లడించింది. ఇది, కంప్లీట్ బాలయ్య-గోపీచంద్ మలినేనిల పవర్ ప్యాక్డ్ యాక్షన్ సినిమా అని తెలిపింది. ఇక, NBK 111లో తన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని..తన కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని చెప్పింది. దీంతో ఈ మూవీపై అంచనాలు ఇంకా రెట్టింపయ్యాయి.












