సినిమా

Bhagyashri Borse: లెనిన్ సినిమా చేయాలని విధి నిర్ణయించింది

రచన: Anshu4 నిమిషాల పఠనం

Bhagyashri Borse: తెలుగులో ఇప్పటి వరకూ ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయిన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. అయినా, కూడా అందం అభినయంతో అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ప్రస్తుతం ఈ బక్కపలచని బ్యూటీ నటించిన లెనిన్ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. జూలై 10వ తేదీన లెనిన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Bhagyashri Borse: తెలుగులో ఇప్పటి వరకూ ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయిన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. అయినా, కూడా అందం అభినయంతో అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ప్రస్తుతం ఈ బక్కపలచని బ్యూటీ నటించిన లెనిన్ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. జూలై 10వ తేదీన లెనిన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ప్రమోషన్స్‌లో లెనిన్ సినిమా అవకాశం గురించి మాట్లాడింది.

మనం ఏ సినిమా చేయాలో ముందే డెస్టినీ డిసైడ్ చేస్తుంది. అంతే తప్ప మనం ప్లాన్ చేసుకుంటే జరగదు అని చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడింది. వాస్తవానికి, ఈ సినిమాలో ముందు శ్రీలీల హీరోయిన్‌గా కన్‌ఫర్మ్ అయింది. లుక్ అండ్ మేకోవర్ కూడా జరిగింది. చాలా క్యూట్‌గా కూడా పోస్టర్స్ లో కనిపించింది శ్రీలీల. కొంతవరకూ షూటింగ్ కూడా జరిపారు. కానీ, తనకున్న కమిట్‌మెంట్స్ వల్ల లెనిన్ నుంచి తప్పుకుంది.

దాంతో, శ్రీలీల ప్లేస్‌ని భాగ్యశ్రీ బోర్సే రీప్లేస్ చేసింది. ఇదే, విషయాన్ని ప్రెస్‌మీట్స్ లో అడిగితే, విధి ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుంది. లెనిన్ మూవీలో అవకాశం రావడం నా అదృష్టం అని చెప్పింది. అంతేగానీ, ఈ ఛాన్స్ మిస్ చేసుకున్న శ్రీలీలది బ్యాడ్‌లక్ అని మాత్రం చెప్పలేదు. దీంతో, అందరూ భాగ్యశ్రీ మాట్లాడిన విధానానికి ఫిదా అయ్యారు. మరి, ఈ సినిమాతోనైనా ఈ బ్యూటీకి హిట్ పడుతుందా లేదా చూడాలి.

మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన భాగ్యశ్రీ బోర్సే, మొదటి సినిమాలో అందాల ఆరబోతతో పాటు మంచి నటనని కనబరిచింది. కానీ, ఈ సినిమా ఫ్లాప్‌గా మిగిలింది. దీని తర్వాత చేసిన కింగ్‌డం, ఆంధ్రాకింగ్ తాలూకా కూడా డిసప్పాయింట్ చేశాయి. ప్రస్తుతం భాగ్యశ్రీ హోప్స్ అన్నీ లెనిన్ సినిమా మీదే పెట్టుకుంది. కాగా, ఈ సినిమాను అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మించారు.

#BhagyashriBorse#lenin#akhil#sreeleela#nagarjuna
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి