టాప్ న్యూస్

TGSRTC : కండక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. అర్హత, పోస్టులు వివరాలు ఇవే!

రచన: Kumar3 నిమిషాల పఠనం

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. టీజీఎస్‌ఆర్టీసీ(TGSRTC)లో కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఖాళీగా ఉన్న 1,500 కండక్టర్ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. టీజీఎస్‌ఆర్టీసీ(TGSRTC)లో కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఖాళీగా ఉన్న 1,500 కండక్టర్ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చాలా కాలం తర్వాత ఆర్టీసీలో పోస్టులు భర్తీ చేయనున్నారు. అందుకే ఆర్టీసీ యాజమాన్యమే నేరుగా ఈ నియామక ప్రక్రియను చేపట్టనుంది. ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాతపరీక్ష ఉండదు. కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉండనుంది.

గతంలో హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో పెరిగిన ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తాత్కాలికంగా అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని వాడుకోగా.. ఇప్పుడు రిజర్వేషన్ల రూల్స్ మేరకు రీజియన్ల వారీగా పర్మనెంట్ ఉద్యోగాలు వీటిని ఫిల్ చేయనున్నారు. అయితే, ఉద్యోగాల భర్తీలో చిన్న సమస్య ఉందని తెలిసింది. గతంలో ఎస్ఎస్‌సీ బోర్డు మార్కుల విధానాన్ని అమలు చేయగా.. ప్రస్తుతం జీపీఏ గ్రేడింగ్ పద్ధతిని తెచ్చారు.

మరల మార్కుల విధానాన్నే కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మార్కుల విషయం ఎలా తేల్చాలి అనే విషయంపై ఆర్టీసీ అధికారులు ఎస్సెస్సీ బోర్డుకు లేఖ రాశారు. SSC బోర్డు నుంచి గ్రేడింగ్ లెక్కింపుపై క్లారిటీ రాగానే ఉద్యోగాల భర్తీ కోసం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల కానుంది. కాగా, ఇప్పటికే పోలీసు శాఖలో 7వేలకు పైగా పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

#Conducter posts#tgsrtc#telangana#ssc marks
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి