తెలంగాణ

Rains : పాపం రైతులు.. రుతుపవననాలొచ్చాయి..మరి వర్షాలెక్కడ?

రచన: Kumar3 నిమిషాల పఠనం

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి.నెల రోజులు గడుస్తున్నా వర్షాలు మాత్రం రావడం లేదు. ఈసారి ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ఇప్పటికే భారత వాతావరణ కేంద్రంతో పాటు విశాఖ వెదర్ రిపోర్టు సైతం స్పష్టంచేసింది.

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి.నెల రోజులు గడుస్తున్నా వర్షాలు మాత్రం రావడం లేదు. ఈసారి ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ఇప్పటికే భారత వాతావరణ కేంద్రంతో పాటు విశాఖ వెదర్ రిపోర్టు సైతం స్పష్టంచేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఏకంగా 17 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. సాగు పనులు మొదలు పెట్టిన రైతులు వానల కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. జులై నెల ప్రారంభమై పది రోజులు కూడా గడిచాయి. ఇప్పటికీ సాధారణం కంటే తక్కువ వర్షాలే కురిసే అవకాశముందని వాతావరణశాఖ చెప్పడం అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నది.

గతంతో పోలిస్తే ఈ ఏడాది ఆలస్యంగా రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయి. గత నెల 8న నైరుతి రుతుపవనాలు జోగులాంబ గద్వాల జిల్లా నుంచి తెలంగాణను తాకాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని జిల్లాల్లో మాత్రమే మోస్తరు నుంచి సాధారణ వర్షపాతం నమోదైంది.అక్కడక్కడ చిన్న చిన్న చిరుజల్లులు, సాధారణ వర్షపాతం నమోదైంది.ఉత్తర తెలంగాణను కాస్త వర్షాలు మురిపించినా..దక్షిణ తెలంగాణలో మాత్రం అసలు వర్షం ఊసే లేదు. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 265 మండలాల్లో లోటు, 46 మండలాల్లో అత్యంత లోటు వర్షపాతం నమోదైంది.ఎల్ నినో పరిస్థితుల కారణంగా ఈ నెలలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షాలే నమోదయ్యే చాన్స్ ఐఎండీ తెలిపింది. కాగా, అటు వర్షాలు లేక, ఇటు పంటలకు సాగునీరు లేక రైతులు అల్లాడుతున్నారు.

#farmers#no Rains#El nino#telangana#agriculture
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి