మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా అక్కడి జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటికే రెండు రోజులు అక్కడి విద్యాసంస్థలకు సెలవులు సైతం ప్రకటించినట్టు సమాచారం. ఇటీవల పుణెలో ఒక్కరోజే 20సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో కొత్తగా నిర్మించి అండర్ గ్రౌండ్ టన్నెల్ వద్ద కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే.
రోడ్లు ,బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పెద్దఎత్తున వరద నీరుప్రవహిస్తోంది. పలురైల్లు సైతం రద్దు అయ్యాయి. మరోవైపు ఈదురుగాలులు వీస్తుండటంతో అక్కడి జనాలు ఇళ్లల్లో నుంచి బయటకు రావడం లేదు. చెట్లు ఎక్కడి కక్కడ విరిగిపడుతుండటంతో మాన్‌సూన్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. తాజాగా కురిసిన వర్షాలకు ఓ గ్యాస్ ప్లాంట్‌లోకి భారీగా వరద నీరు చేరింది.
https://x.com/TeluguScribe/status/2075050459304497368?s=20
మహారాష్ట్ర - రాయఘడ్ ప్రాంతంలోని పాతాళగంగ వద్ద ఉన్న HPCL బాట్లింగ్ ప్లాంట్లోకి వరద నీరు రావడంతో 3వేల సిలిండర్లు కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియోప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతోంది. పెద్దఎత్తున వరద రాగా అందులో సిలిండర్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.ఇలాంటి వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర సర్కార్ హెచ్చరికలు పంపుతోంది.












