వైరల్ న్యూస్

Viral : కులాంతర వివాహం చేసుకుందని.. అమ్మాయి ఫ్యామిలీ దారుణ చర్య!

రచన: Kumar3 నిమిషాల పఠనం

కులాంతర వివాహాం చేసుకుందని యువతి కుటుంబసభ్యులు దారుణ చర్యకు పాల్పడ్డారు. యువకుడి ఇంటికి వెళ్లి రచ్చరచ్చ చేశారు. ఆ తర్వాత అమ్మాయిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.

కులాంతర వివాహాం చేసుకుందని యువతి కుటుంబసభ్యులు దారుణ చర్యకు పాల్పడ్డారు. యువకుడి ఇంటికి వెళ్లి రచ్చరచ్చ చేశారు. ఆ తర్వాత అమ్మాయిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే..మెదక్ జిల్లా సలాబత్‌పూర్ గ్రామానికి చెందిన యువతిని ఈ నెల 6న ఎల్లపూర్ గ్రామానికి చెందిన ప్రణయ్ అనే యువకుడు కులాంతర ప్రేమవివాహం చేసుకున్నాడు.

అది కాస్త అమ్మాయి కుటుంబీకులు, వారి బంధువులకు నచ్చలేదు. దీంతో నాలుగు కార్లలో ప్రణయ్ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులపై దాడి చేసి యువతిని బలవంతంగా ఆమె కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అనంతరం ప్రణయ్ కుటుంబం పోలీసులను ఆశ్రయించగా..ఇరు కుటుంబాలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఆ సమయంలో కట్టుకున్న భర్తతోనే తాను ఉంటానని యువతి చెప్పడంతో ఆమెను అతనితో ఇచ్చి పంపిచారు. మరోసారి ఇటువంటి దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అనంతరం వారికి పంపించి వేశారు. అయితే, యువతి కుటుంబీకులు ప్రణయ్ ఇంటికి వెళ్లి దాడులకు పాల్పడి యువతిని ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://x.com/TeluguScribe/status/2075073929857954301?s=20

#intercast marriage#medak#family attack#girl kidnap#crime
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి