Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా కోలీవుడ్..బాలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా తన నటనతో ఆకట్టుకొని స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి సమంత. మొదట యాడ్ ఫిలింస్, ఆ తర్వాత ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా సౌత్‌లో ఎంట్రీ. సమంత నటించిన మొదటి తెలుగు సినిమా అక్కినేని నాగ చైతన్యతో చేసిన ఏ మాయ చేశావే.
ఆ తర్వాత తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది. అంతేకాదు, బడా నిర్మాణ అంస్థలు, అగ్ర దర్శకులతోనూ పనిచేసింది. మొదటి సినిమాతోనే లిప్ లాక్స్, ఆ తర్వాత బికినీ షూట్స్..అసలు క్యారెక్టర్స్ డిమాండ్ చేస్తే దేనికి తగ్గలేదు.. వెనకాడలేదు. అలాంటి, సమంత, నాగ చైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా తన పంథా మార్చుకుంది.
పద్ధతైన పాత్రల్లో నటించింది. ఓ బేబీ, మజిలీ లాంటి సినిమాలు బాగా పేరు తెచ్చాయి. ఆ తర్వాత చేసిన యశోద, శాకుంతలం మాత్రం బెడిసికొట్టాయి. అదే సమయంలో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి..ది ఫ్యామిలీ మేన్ 2 సిరీస్‌లో బోల్డ్ క్యారెక్టర్ చేసి వావ్ అనిపించింది. అయితే, సమంత మైయోసైటిస్ తో బాధపడి కొంతకాలం సినిమాలకి దూరంగా ఉంది. అదే, సమయంలో దర్శక-నిర్మాత రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.
పెళ్లి తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తూ చేసిన మా ఇంటి బంగారం అద్భుతమైన విజయాన్ని అందుకుంది. గృహిణి పాత్రలో నటిస్తూనే, యాక్షన్ సీక్వెన్స్ కూడా చేసింది. ఈ సినిమా హిట్ తర్వాత ఇకపై కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలను తప్ప, ఏమాత్రం గ్లామర్ రోల్స్ చేయకూడని నిర్ణయించుకుంది. అంతేకాదు, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది. మా ఇంటి బంగారం 100 కోట్ల మార్క్ కి దగ్గర్లో ఉంది. అందుకే, ఇప్పుడు చాలామంది స్టార్ హీరోయిన్స్ సమంతను ఫాలో అవ్వాలని చూస్తున్నారట.












