Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, మిగతా భాషలలోని సినీ ప్రముఖులతోటి ప్రశంసలుకున్న బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించాడు. చరణ్ సరసన జాన్వీ కపూర్ నటించింది. కీలక పాత్రల్లో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ నటించారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.
పెద్ది షూటింగ్ మొదలైనప్పుడు ఉన్న క్రేజ్..ఆ తర్వాత వదిలిన ఫస్ట్ షాట్‌తో అమాంతం పెరిగిపోయింది. ఫస్ట్ లిరికల్ సాంగ్ చికిరి చికిరి రిలీజైయ్యాక పెద్ది బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ నమోదు చేస్తుందనుకున్నారు. అటు దర్శకుడు బుచ్చిబాబు కి, ఇటు రామ్ చరణ్ కి మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని చెప్పుకున్నారు. ఒకే సినిమాలో ఒకే పాత్ర రెండు వైవిధ్యమైన క్రీడల్లో పాల్గొనే కథ.. వినడానికి ఎంతో బావుంది.
కానీ, ఆ కథను తెరపై ఆవిష్కరించడంలో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు. చరణ్ ఎంతో శ్రమించి సరికొత్త ట్రాన్స్ఫర్మేషన్స్ కి మారినప్పటికి కూడా ఉపయోగం లేకుండా పోయింది. పైగా కొన్ని సీన్స్ మరీ అతిగా ఉండటంతో ట్రోల్స్ చేశారు. జాన్వీ కపూర్ పాత్ర గురించి అసలు మాట్లడడానికి కూడా ఇష్టపడని వారున్నారంటే అర్థం చేసుకోవచ్చు. థియేటర్స్ రన్ లో ఉన్నన్ని రోజులు అన్ని కోట్లు ఇన్ని కోట్లు వచ్చాయని ఊదరగొట్టారు.
తీరా చూస్తే ఫ్లాప్ సినిమాగా లెక్కలోకి తీసుకున్నారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా జూలై 9 నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. మరి, థియేటర్స్‌లో పెద్దగా ఆదరణ దక్కని పెద్ది సినిమాకి, ఓటీటీలో లభిస్తుందా.. అనేది చూడాలి. చాలా సినిమాలు థియేటర్స్‌లో ఫ్లాపైనప్పటికీ, స్మాల్ స్క్రీన్ మీద, ఓటీటీలలో సక్సెస్ అయ్యాయి. పెద్ది బిగ్ స్క్రీన్ మీద డిసప్పాయింట్ చేసింది. మరి, స్మాల్ స్క్రీన్ మీదైనా హిట్ అవుతుందా చూడాలి.












