Ketika Sharma: కొంతమంది యంగ్ బ్యూటీస్ ఇలా వచ్చి అలా ఫేడవుట్ అవుతుంటారు. అలా ఫేడవుట్ అయిన వాళ్ళలో హాట్ బ్యూటీ కేతిక శర్మ కూడా ఉంది. వాస్తవానికి ఇంత త్వరగా ఫేడవుట్ అవ్వాల్సిన అమ్మాయి కాదనే చెప్పాలి. సరైన సినిమాలను ఎంచుకోలేక తప్పటడులు వేసి కెరీర్ ని ప్రారంభంలోనే తలకిందులు చేసుకుంది. పూరి జగనాధ్ లాంటి అగ్ర దర్శకుడి చేతి వాటం కూడా పనిచేయలేదు.
కేతిక శర్మ నటించిన మొదటి సినిమా రొమాంటిక్. ఆకాష్ పూరి హీరోగా నటించాడు. తన ఏజ్ కి తగ్గ కథ కాకపోవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రొమాంటిక్ సినిమాను డార్లింగ్ ప్రభాస్ కూడా ప్రమోట్ చేశాడు. అయినా, రొటీన్ కథ కావడంతో ఫ్లాప్ సినిమాగా మారింది. మన సినిమా ఇండస్ట్రీలో హిట్ అయితే హీరోకి ఫ్లాపైతే హీరోయిన్ క్రెడిట్స్ ఇస్తారు.
అయినా, కూడా కేతిక శర్మకి మన మేకర్స్ అవకాశాలిచ్చారు. రొమాంటిక్ సినిమా ఫ్లాపైనా నాగశౌర్య సరసన లక్ష్య, పంజా వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా, పవన్ కళ్యాణ్, సాయి దుర్గ తేజ్ నటించిన బ్రో సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. కానీ, ఈ సినిమాలేవీ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దాంతో, హీరోయిన్‌గా అవకాశాలు లేకుండా పోయాయి.
కానీ, ఐటం సాంగ్స్ మాత్రం అడపాదడపా వస్తున్నాయి. నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమాలో "అదిదా సర్‌ప్రైజ్" అంటూ హాట్ హాట్ అందాలతో ఊపేసింది. ఈ పాటలో ఘాటు అందాలతో ఆకట్టుకుంది. ఇప్పుడు హిందీలో ఢమాల్ 4 మూవీలో చేస్తోంది. అయితే, ఇందులో హీరోయిన్‌గా నటిస్తుందా లేక ఐటం సాంగ్ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక, ఈ మూవీలో అజయ్ దేవగన్, అర్షద్ వార్సీ, రితీష్ దేశ్‌ముఖ్, జావేద్ జాఫేరి, రవి కిషన్, సంజయ్ మిశ్రా, ఉపేంద్ర లిమాయే, అంజలి ఆనంద్, సంజీదా షేక్, ఈషా గుప్తా మరియు విజయ్ పాట్కర్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. ప్రస్తుతం అజయ్ దేవగన్ తో ఉన్న కేతిక ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












