Payal Rajput: సోషల్ మీడియాను ఎంత ఉపయోగించుకుంటే అంత పాపులారిటీ వస్తున్న రోజులివి. చెడు జరగాలన్నా మంచి విషయాలు తెలుసుకోవాలన్నా ఇప్పుడు అందరూ సోషల్ మీడియానే అడుగుతున్నారు. సెలబ్రిటీలు కూడా ఇన్స్టాగ్రాంలో రక రకాల పోస్టులు పెట్టి ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నారు. కొందరు, దీని ద్వారా పాపులారిటీతో పాటు డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు. అలాగే, ట్రోల్స్ కి కూడా గురౌతున్నారు. ఇప్పుడు, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
పాయల్ రాజ్‌పుత్ అంటే అందరికీ గుర్తొచ్చే సినిమా ఆర్ఎక్స్ 100. ఈ సినిమాలోని పిల్లా రా అనే పాట అలా కళ్లముందు కదులుంది. దీని, తర్వాత బుల్లెట్టు ఎక్కొచ్చే బుల్‌రెడ్డి పాట. హీరోయిన్‌గా రావాల్సిన క్రేజ్ రాలేదనే చెప్పాలి. దీనికి కారణం పాయల్‌ని అందరూ ఆర్ఎక్స్ 100 సినిమాలో మాదిరిగానే చూశారు. వెంకటేష్ సరసన వెంకీ మామా సినిమాలో నటించినా కూడా మొదటి సినిమా ఇంపాక్ట్ మాత్రం పోలేదు.
ఆర్ఎక్స్ 100 సినిమా హిట్ తర్వాత దాదాపు 70 కథలు విన్నప్పటికీ, అన్నిటిలో లిప్ లాక్స్, సెమీ న్యూడ్ సీన్స్ ఉన్నాయని రిజెక్ట్ చేసింది పాయల్. ఈలోపు తనపై నెగిటివిటీ పెరిగింది. దాంతో, వస్తాయనుకున్న అవకాశాలు రాలేదు. ఐటం సాంగ్స్ కూడా చేయాల్సి వచ్చింది. మళ్ళీ మొదటి సినిమా దర్శకుడే మంగళవారం సినిమాలో బోల్డ్ అండ్ డస్కీ రోల్ ఇచ్చి సక్సెస్ ఇచ్చాడు. పాయల్ చేతిలో ఇప్పుడు చెప్పుకునేంత పెద్ద సినిమాలు లేవు.
ఇక, తాను కూడా ఇన్స్టాలో సబ్‌స్క్రిబ్షన్ పెట్టింది. దీంతో కొందరు నెటిజన్స్ రక రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఇలా, నెటిజన్స్ ని ఆకట్టుకుని హాట్ పిక్స్, రొమాంటిక్ వీడియోస్ షేర్ చేసి డబ్బులు సంపాదించుకుంటావా! అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అలాంటి వారికి పాయల్ స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చింది. మీరు నిజంగా హాట్ పిక్స్, బోల్డ్ కంటెంట్ కావాలనుకుంటే నా ఇన్స్టా సబ్‌స్క్రైబ్ చేసుకోవద్దని స్పష్టంగా తేల్చి చెప్పింది. గతంలో, ఇలా చేస్తున్నారనే విష్ణు ప్రియ, అనన్య నాగళ్లపై కామెంట్స్ చేశారు.












