రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లిదండ్రులే వారి సంతానం పట్ల అమానుషంగా ప్రవర్తించారు.చిన్న పిల్లలు అనే జాలి, దయ చూపకుండా వారిని చిత్రహింసలు పెడుతున్నట్టు తెలిసింది. దెబ్బలు, గాయాలు తాళలేక పిల్లలు కేకలు విని వారిని స్థానికులు రక్షించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో తల్లిదండ్రులకు మతిస్థిమితం బాలేదని దగ్గరి బంధువులు పేర్కొనడం కీలకంగా మారింది.ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్‌లో గురువారం వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. హుజుర్ నగర్లో కన్న బిడ్డల పట్ల పేరెంట్స్ అమానుషంగా ప్రవర్తించారు. అతిదారుణంగా కొట్టి, చిత్రవద చేస్తూ, వాతలు పెట్టారు.పిల్లల అరుపులు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వారు అక్కడకు చేరుకుని పిల్లలను రక్షించారు. అనంతరం తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. కాగా, తల్లిదండ్రుల మతిస్థిమితం బాగా లేదని.. పిల్లలను సురక్షితంగా కాపాడాలని పోలీసులకు బంధువులు ఫిర్యాదు చేశారు. పిల్లల ఒంటిమీద కాలిన గాయాలు, కమిలిపోయిన చర్మానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












