సినిమా

Nidhhi Agerwal: పెళ్లికి ఎలాంటి కుర్రాడు కావాలంటే!

రచన: Anshu3 నిమిషాల పఠనం

Nidhhi Agerwal: ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, తనకి ఎలాంటి కుర్రాడు కావాలో క్లారిటీ ఇచ్చింది. సాధారణంగా సినీ తారలు ఉన్నన్నీ రోజులు సినిమా ఇండస్ట్రీలో ఉండి..ఉన్నపలంగా వ్యాపారవేత్తనో, ఇతర దేశానికి చెందిన వాడినో పెళ్లి చేసుకుంటారు.

Nidhhi Agerwal: ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, తనకి ఎలాంటి కుర్రాడు కావాలో క్లారిటీ ఇచ్చింది. సాధారణంగా సినీ తారలు ఉన్నన్నీ రోజులు సినిమా ఇండస్ట్రీలో ఉండి..ఉన్నపలంగా వ్యాపారవేత్తనో, ఇతర దేశానికి చెందిన వాడినో పెళ్లి చేసుకుంటారు. కానీ, నిధి మాత్రం సౌత్ కి చెందిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని తాజాగా క్లారిటీ ఇచ్చింది.

తిరుపతిలో ఓ మొబైల్ స్టోర్ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా వెళ్ళింది. ఆ సమయంలో విలేఖరులతో కాసేపు ముచ్చటించింది. ఓ విలేఖరి పెళ్ళి గురించి అడిగాడు. దానికి, నిధి సమాధానంగా..నాకు ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు. కానీ, ఖచ్చితంగా దక్షిణాదికి చెందిన కుర్రాడినే పెళ్లి చేసుకుంటాను. వరుడు కుదిరిన వెంటనే తిరుపతిలో పర్యటించి ప్రకటిస్తానని తెలిపింది.

ఇక, శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. అలాగే, తాను నటిస్తున్న సినిమాల గురించి కూడా అప్‌డేట్ ఇచ్చింది. ప్రస్తుతం రెండు తమిళ సినిమాలలో హీరోయిన్‌గా నటిస్తున్నానని..వీటితో పాటు రెండు తెలుగు సినిమాలకి సైన్ చేశానని, ఆ వివరాలు దర్శకనిర్మాతలు ఇస్తారని చెప్పింది. మొత్తానికి, ఖాళీగా ఉందనుకున్న నిధి...4 ప్రాజెక్ట్స్‌తో బిజీగానే ఉంది.

అయితే, బాలీవుడ్‌లో మొదటి సినిమా చేసిన తర్వాత మళ్ళీ అక్కడ అవకాశాలు రాలేదు. తెలుగులో చేసిన సినిమాలలో ఒక్క ఇస్మార్ట్ శంకర్ మాత్రం హిట్ సాధించింది. గత చిత్రం ది రాజాసాబ్ కూడా ఫ్లాపైంది. అయినా కూడా, నిధికి సినిమాలు వస్తున్నాయంటే ఇంకా తనకి ఇండస్ట్రీలో నిలదొక్కుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఇప్పుడు చేస్తున్న సినిమాలతోనైనా స్టార్ హీరోయిన్‌గా పాపులారిటీని తెచ్చుకుంటుందేమో. అన్నట్టు, ఈ ఇస్మార్ట్ బ్యూటీ పక్కా హైదరాబాదీ అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు.

#NidhhiAgerwal#ActressNidhhiAgerwal#NidhhiAgerwalmovieupdates
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి