రాజకీయాలు

Rajyasaba : బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా వద్దిరాజు రవిచంద్ర.. కేసీఆర్ కీలక నిర్ణయం!

రచన: Kumar3 నిమిషాల పఠనం

మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభలో బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్‌గా, పార్లమెంటరీ పార్టీ లీడర్‌గా ఎంపీ వద్దిరాజు రవిచంద్రను నియమిస్తూ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు (KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు.

మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభలో బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్‌గా, పార్లమెంటరీ పార్టీ లీడర్‌గా ఎంపీ వద్దిరాజు రవిచంద్రను నియమిస్తూ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు (KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటివరకు ఆ బాధ్యతల్లో కొనసాగిన సీనియర్ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో ఆ స్థానంలో వద్దిరాజు రవిచంద్రను ఎన్నకున్నట్టు బీఆర్ఎస్ ప్రకటించింది.

ఈ మేరకు రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు కేసీఆర్ అధికారికంగా లేఖ రాశారు.ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ లేఖలో స్పష్టం చేశారు.కాగా, రాజ్యసభలో బీఆర్‌ఎస్ తరపున వద్దిరాజు రవిచంద్ర పార్లమెంట్‌లో తెలంగాణ, పార్టీ గళాన్ని బలంగా వినిపించనున్నారు. ఇదిలాఉండగా, ప్రస్తుతం రాజ్యసభలో బీఆర్ఎస్ బలం ఆరు నుంచి నాలుగుకు పడిపోయింది. గతంలో కే.కేశరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఏప్రిల్ 2026లో సురేశ్ రెడ్డి పదవీ కాలం ముగిసింది. ప్రస్తుతం బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలుగా వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి, దివకొండ దామోదర్ రావు,కంచర్ల రవి కుమార్‌లు ఉన్నారు.

#mp vaddiraju ravichandra#brs rajyasaba floor leader#appoined#kcr
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి