రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త.. పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి కీలక అప్డేట్. తెలంగాణ పోలీసు శాఖలో 7 వేలకు పైగా పోలీసు ఉద్యోగాల భర్తీకి ఇటీవల ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా టీఎస్ఎల్‌పీఆర్‌బీ (TSLPRB) డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సిద్దం చేసింది.దానికి సీఎం ఆమోదం కోసం పంపించినట్టు తెలుస్తోంది.
సీఎం రేవంత్ నుంచి ఆమోదం లభించగానే వచ్చే వారంలో పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కానుందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పోలీసు శాఖలో 5000, అగ్నిమాపక శాఖలో 790, జైళ్ల శాఖలో 223, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సులో 1,424 పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా, పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రానుందని తెలియడంతో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల యువకులు, నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల బాట పట్టినట్టు సమాచారం. స్టడీ సెంటర్లు సైతం అభ్యర్థులతో కిటకిటలాడుతున్నట్టు తెలుస్తోంది.












