సినిమా

Heroine Anjali: నాలుగేళ్ల ప్రేమ‌.. ఆ దెబ్బతో వ‌దిలేశారు..!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Heroine Anjali: వెండితెరపై తన నటనతో, సహజసిద్ధమైన హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన నటి అంజలి. వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్, కోలీవుడ్‌లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ హీరోయిన్.. తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. సినిమా ప్రపంచంలో సెలబ్రిటీల ప్రేమకథలు ఎప్పుడూ హాట్ టాపిక్కే.

Heroine Anjali: వెండితెరపై తన నటనతో, సహజసిద్ధమైన హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన నటి అంజలి. వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్, కోలీవుడ్‌లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ హీరోయిన్.. తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. సినిమా ప్రపంచంలో సెలబ్రిటీల ప్రేమకథలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, అంజలి జీవితంలో జరిగిన ఒక విచిత్రమైన ప్రేమ ముచ్చట ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

స్కూల్ రోజుల్లో ప్రతి ఒక్కరి లైఫ్‌లోనూ చిన్న చిన్న లవ్ స్టోరీలు, క్రష్‌లు ఉండటం సహజం. అంజలికి కూడా అలాంటి ఒక అనుభవం ఎదురైంది. ఆమె క్లాస్‌మేట్ ఒకరు ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు.. అంటే దాదాపు నాలుగేళ్ల పాటు ఆమె వెంటే పడ్డాడు. ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అంటూ ప్రతిరోజూ అంజలి చుట్టూ తిరిగాడు. అయితే చదువుకునే వయసులో ఈ గోలేంటని భావించిన అంజలి.. ఎలాగైనా ఈ తలనొప్పికి శాశ్వతంగా ముగింపు పలకాలని ఒక క్రేజీ ప్లాన్ వేశారు.

తనకు అతనిపై ఎలాంటి ప్రేమ లేదని అంజలి ముఖం మీదే చెప్పేసారు. కానీ ఆ అబ్బాయి మాత్రం తగ్గలేదు. "నీకు అంత ధైర్యం ఉంటే నాకు రాఖీ కట్టు చూద్దాం" అంటూ అంజలికి సవాల్ విసిరాడు. ఇంకేముంది.. అతనికి బుద్ధి చెప్పాలనుకున్న అంజలి, క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే రాఖీ తీసి అతని చేతికి కట్టేశారు. ఊహించని ఈ షాక్‌తో ఆ అబ్బాయి మైండ్ బ్లాంక్ అయిపోయింది.

తన నాలుగేళ్ల ప్రేమాభిమానాలకు రాఖీతో ఫుల్‌స్టాప్ పడటాన్ని ఆ కుర్రాడు తట్టుకోలేకపోయాడు. వెంటనే ఆ రాఖీని తెంపి అవతల పారేసి, అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోయాడు. ఆ దెబ్బతో అంజలి జోలికి రావడం పూర్తిగా మానేశాడు. ఆ తర్వాత వారిద్దరూ మళ్లీ ఎప్పుడూ కలుసుకోలేదట. చిన్ననాటి ఈ విచిత్రమైన ప్రేమకథను అంజలి ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకోవడంతో, ఈ క్రేజీ మేటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

#anjali#actress anjali#heroine anjali#tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి