రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ప్రోటోకాల్ పాటించలేదని ఆమె మీద ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తున్నది.సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం, బోనాల ఏర్పాట్ల సమన్వయ సమావేశంలో మంత్రి కొండా సురేఖ ప్రొటోకాల్ పాటించలేదని తెలిసింది.
స్థానిక సనత్ నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని లేకుండా బల్కంపేట కల్యాణోత్సవ ఏర్పాట్లపై ఆమె సమీక్ష నిర్వహించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ లేకుండా సమావేశం నిర్వహణపై బీఆర్ఎస్ నేతలు భగ్గమన్నారు. ఓడిపోయిన అభ్యర్థులు.. కాంగ్రెస్ పార్టీ నాయకులతో బల్కంపేట ఎల్లమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్ష, పోస్టర్ ఆవిష్కరణ ఎలా చేస్తారని కారు పార్టీ నేతలు మండిపడుతున్నారు.
కాగా, గత రెండ్రోజులుగా మంత్రి కొండాను వివాదాలు చుట్టుముట్టాయి. మంత్రిగా ఆమె ప్రమేయం, అనుమతి లేకుండా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆమె శాఖ మీద సమీక్ష చేయడంతో ఆమె హైకమాండ్, సీఎం రేవంత్‌కు లేఖ రూపంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కడియం మీద చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేయగా.. హైకమాండ్, సీఎం నుంచి ఎటువంటి స్పందన లేదు.












