Fauzi: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న పీరియాడికల్ సినిమా ఫౌజీ. ఈ సినిమా షూటింగ్ హైదరాంబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సమయంలో బాలీవుడ్ నటుడు ప్రమాదానికి గురయ్యాడు. అసలేం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం.
టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో స్వాతంత్రానికి ముందు జరిగిన కథాంశంతో ఓ భారీ బడ్జెట్ పీరియాడిక్ మూవీ రూపొందుతోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇన్స్టాగ్రామ్ ఫేమ్ ఇమాన్వీ ఈ మూవీతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమవుతోంది.
అయితే, షూటింగ్ సమయంలో ఇందులో నటిస్తున్న బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మ తీవ్ర అస్వస్థకి గురయ్యాడు. షూటింగ్ అయ్యాక, దట్టమైన చెట్లు ఉన్న ప్రాంతంలో మూవీ టెక్నీషియన్లతో మాట్లాడుతున్నాడట. ఆ సమయంలో రాజేష్ శర్మను ఓ విషపూరిత కీటకం కుట్టింది. దీన్ని ముందు అంతగా పట్టించుకోలేదట. కానీ, ఆరు గంటల తర్వాత కాలులో తీవ్రమైన నొప్పి మొదలైంది.
అలా అనారోగ్యంతో ఉన్నా కూడా కోల్‌కతాకు ఫ్లైట్ ఎక్కాడు. అయితే, ప్రయాణం మధ్యలో రాజేష్ శర్మకు తీవ్రమైన జ్వరం రావడంతో పాటు పరిస్థితి విషమించింది. కోల్‌కతా చేరుకోగానే ఆయనను అక్కడి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు రాజేష్ శర్మ ఐసీయూలో ఉన్నాడు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. రాజేష్ శర్మ ఇంకా ప్రమాదం నుండి బయటపడలేదని, పూర్తిగా పరీక్షలు చేసిన తర్వాతే హెల్త్ అప్‌డేట్‌ను విడుదల చేస్తారట. చూడాలి, రాజేష్ శర్మ కోలుకోవడానికి ఎన్నిరోజులు పడుతుందో.












