స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

హైడ్రా.. హైడ్రామాలు నిజమే ?

రచన: Swechaanews Chaiman10 నిమిషాల పఠనం

హైడ్రా అంటే అనుకున్నది చేసేంత వరకు వదలని వ్యవస్థ. దీనికి కండిషన్స్ వర్తిస్తాయి. పొలిటికల్ ఒత్తిళ్లతో బహుగా పనిచేస్తుంది. వాళ్ల లిస్టులో ఉండే కంపనీల జోలికి వెళ్లరు. వీళ్లకు ఉన్న టార్గెట్ ని రీచ్ అవుతున్నారనే అరోపణలు ఉన్నాయి. ఓ వాసవి, మూసి లో శ్రీ అదిత్య, ప్రేమవతిపేట్ లో ప్రెస్టేజీ, ఎస్ఆర్ఆర్ రివర్ వ్యూ ఇలా చెప్పకుంటూ పోతే గత 2 ఏండ్లలో వీళ్ల తీరు పై హైడ్రామాలే అని హైదరాబాద్ ప్రజలు అనుకుంటున్నారు.

బడా కంపెనీల జోలికి వెళ్లని రంగనాథ్

* లిస్టులో వాసవి, శ్రీఆదిత్య, ప్రెస్టేజీ, ఎస్ఆర్ఆర్‌తో పాటు మరెన్నో?

- హడావుడిగా ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌పై తీసుకున్న నిర్ణయంతో నవ్వుల పాలు?

- కూల్చివేతలేనా.. ఆ తర్వాత తతంగం ఏంటో ఫాలో చేయండి?

- జీరో పర్మిషన్స్‌తో గురుకుల్ ట్రస్ట్ భూముల్లో ఎన్ని నిర్మాణాలు జరుగుతున్నాయో తెలియదా?

- తీరు మార్చుకోని సంధ్య శ్రీధర్ రావుపై ఎలాంటి కేసులు పెట్టారో చెబుతారా?

- గాజుల రామారంలో వందల్లో పేదల ఇళ్లను కూల్చారు

- కూన వెంకటేశ్ కుటుంబం రూ.100 కోట్ల కబ్జా కనపడడం లేదా?

- వందల కోట్లు కేటాయించారు.. ఎంతోమంది ఉద్యోగులు మీ కిందనే?

- ఉద్దేశం మంచిదే.. మీకున్న మరో కోణంతోనే ఇబ్బంది?

- గ్రౌండ్‌లో ఏం జరుగుతుందో అప్‌డేట్ లేని హైడ్రాపై స్వేచ్ఛ చైర్మన్ స్పెషల్ స్టోరీ

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

98489070809

రేవంత్ రెడ్డి అంటే.. హైదరాబాద్‌లో హైడ్రానే?

పకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. కాళేశ్వరం అవినీతి ఎంత కారణం అయిదో, 111 జీవో నిర్ణయం కూడా అలానే వెంటాడింది. చెరువులు, వాగులు, కుంటలు ఎన్నో కబ్జా అయ్యాయి. అన్ని రిపోర్టులు ఉన్నా ఆ రోజు ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే పకృతిపై ప్రేమతో ప్రభుత్వ స్థలాలను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి వందల కోట్ల బడ్జెట్‌తో హైడ్రాని తీసుకొచ్చారు. కానీ ఆయన మార్క్ చూపించేలా హైడ్రా పని చేయడం లేదు. అనుచరుల ఒత్తిళ్లకు తలొగ్గుతోంది. ఏది ఎప్పుడు చేయాలో కూడా మర్చిపోతోంది. ఇది మంచి పనికి కాకుండా ఎన్నో ప్రతికార చర్యలకు పనికొస్తోందని చాలా సార్లు రుజువు కూడా అయింది. సీఎం పేర్లు చెప్పిన వాళ్ల బడా కంపెనీల జోలికి వెళ్లడం లేదు. అందులో వాళ్లకు వాటా ఇస్తే అన్నీ సక్రమంగా జరుగుతున్నాయని వాళ్ల అక్రమ రిజిస్ట్రేషన్స్, జీపీఏలు, అగ్రిమెంట్లతో అర్ధం అవుతుంది. వాళ్ల కోసం హైడ్రా పేరును పాడు చేయొద్దు. సీఎం తీసుకున్న సవాళ్లకు వీళ్ల దందాలు సమాధానం కాదు. డబ్బులే అన్నింటికి సమాదానం అయితే కేసీఆర్ టీం సంపాదించింది దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఓటర్ కి వెయ్యి రూపాయలు ఇచ్చేంత అక్రమం. మైహోం, ఫినిక్స్, వంశీరాం, డీఎస్‌ఆర్, ఆదిత్య, ఇలా చెప్పుకుంటూ పోతే డజన్ కంపెనీలు లక్షల కోట్ల డబ్బులు ఇచ్చేలా ఉండేది. ఒక్కసారి ప్రభుత్వం తారుమారు కావడంతో ఎమైంది? మేఘా లాంటి కంపెనీలు హ్యాండ్ ఇచ్చాయి. దుబాయిలో నమ్మి వెయ్యి కోట్లు పెట్టిన శ్రీనిధి శ్రీహరి కూడా మీరెవరు అని అన్నారు. ఆనాడు లబ్ది పొందిన ఎంపీలు, ఐఏఎస్ అధికారులు ఈనాడు జీరో అయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో మంచి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాలు రాజశేఖర్ రెడ్డిలా నిలిచిపోతాయి. రేవంత్ రెడ్డి నిర్ణయం కూడా అదే అయినా హైడ్రా పక్కదారి పడుతోంది.

కార్పొరేట్, రియల్ ఎస్టేట్ కంపెనీలు మీకు ఏం లాభం చేస్తే అగిపోయారు

హైడ్రా అంటే హడల్ ఎత్తేలా ప్రచారం చేసుకున్నారు. చిన్నవాళ్లను బూచిగా చూపించి పెద్ద వాళ్ల వద్ద రాజీ కుదుర్చుకున్నారు. ఇప్పటికీ ఇదే వ్యవహారం జరుగుతోంది. మీకు ఉన్న పవర్స్ తో శ్రీ ఆదిత్యను కొట్టలేరా? ప్రేమవతి పేటలోని ప్రెస్టేజీ 8 ఎకరాలను మళ్లీ తీసుకోలేరా? బాచుపల్లిలో వాసవి టవర్స్ ని కూల్చలేరా? ఆంద్రాకి చెందిన ఎస్ఆర్ఆర్ సంస్థ 6 వేల గజాల పార్క్‌ని , 12 వేల గజాల రోడ్స్‌ని కబ్జా చేస్తే మీరు ఎలా బిల్డర్ కి డైలాగ్ కొట్టి ఇప్పటికీ స్పందచలేదంటే ఏమనుకోవాలి. బుధవారం కూడా కూల్చేస్తామని హమీ ఇచ్చారు. అమలు చేసే దమ్ము ఉందా?

ప్రదీప్ పేరు ఒక్కటే కీటీఆర్ దందా అనుకున్నారా?

కేటీఆర్‌కి ప్రదీప్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. ఫాంహౌజ్ భూముల్లో ఆయన పాత్ర చాలా ఉంది. ఆనాడు నేకే ట్రూత్ అనే ఓ టీవీ పోగ్రాంలో సత్యం రామలింగరాజు కేసు నుంచి ఎలా భయపెట్టి తీసుకున్నారో అన్ని ఆ కథనంలో ఆనాటి స్వేచ్ఛ ఇచ్చింది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ప్రదీప్ కన్‌స్ట్రక్షన్ భవనం కడుతోందని సమాచారం రాగానే 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేశారు. ఆ తర్వాత నిర్మించింది కాంగ్రెస్ నేత అని తెలుసుకుని నాలుక కర్చుకున్నారు. ఇప్పుడు ఆ భూమిలో దందాలు చేశారు. ఇప్పుడు అదే మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో జీరో అనుమతులతో పదుల సంఖ్యలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒక్క బిల్డింగ్‌పై అయినా హైడ్రా కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్ణయం తీసుకుంటుందా? ఖానామెట్ కబ్జాలను కూల్చివేస్తుందా? అంత ధైర్యం హైడ్రాకు ఉందా? సీఎం కుటుంబ సభ్యులు చెప్పారని చాటుగా చేసుకుంటున్న వసూళ్ల దందా ఏంటో మీ దాకా వచ్చిందా?

ఫీల్డ్‌లో నుంచి లేని అప్డేట్స్?

ఏడాదిన్నర క్రితం సంధ్య శ్రీధర్ రావు రోడ్లు, పార్కులు కబ్జా చేసి హోటల్స్ పెట్టారని కూల్చివేశారు. అందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఈ రోజు హైడ్రా కమిషనర్‌గా మీరు, సీఎంసీ కమిషనర్ వెళ్లి పరిశీలిస్తే ఏం తేలింది. ఎందుకు మీ కింది స్థాయిలో ఉండే సీఐలు, ఎస్సైలు మీకు ఇన్నాళ్లు సమాచారం ఇవ్వలేదు. ఇలా ఎన్ని ఉన్నాయో మీకు లెక్కలు కావాలా? మీరు కూల్చివేసిన స్థలంలోనే జరుగుతున్న నిర్మాణాలపై చాలా సమాచారం ఇస్తాను.

గాజులరామారం గుర్తుందా సార్?

ప్రభుత్వ భూమిలో, టీజీఐఐసీ భూముల్లో వేలాది కుటుంబాలు గుడిసెలు వేసుకున్నాయని రాత్రికి రాత్రి కూల్చివేశారు. చంటి పిల్లలతో రోడ్డు పైకి వచ్చారు. భూ దందాలు చేసుకుని బీఆర్ఎస్ నాయకులు సంపాదించుకున్నారు. కానీ నష్టపోయింది ఎవరు అని ఆలోచించారా? కూల్చివేతలతోనే పేరు వస్తుందని ప్రవర్తించింది నిజం కాదా? అందుకు పేదలే బలి అయ్యారు. హైడ్రా మంచి ఉద్దేశం అయినా ఫస్ట్ నుంచి చెడ్డ పేరు రావడానికి మీ పాత్ర, ఒత్తిళ్లకు లోనై చేస్తున్న పనులే? అనుకున్న అధికారులను తీసుకుని ఏం చేస్తున్నారు? కూన వెంకటేశ్ కుటుంబం 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఫంక్షన్ హాల్, ఇంటర్ నేషనల్ స్కూల్ నిర్మించుకుని ఏటా 5 కోట్లు సంపాదించుకుంటోంది. మీ హైడ్రా సిబ్బంది మీకు ఈ సమాచారం ఇవ్వలేదా? వాళ్లు 2014లో రెవెన్యూ సిబ్బంది సపోర్టుతో నిర్మాణాలు చేశారు. కోర్టులో కేసులు ఉన్నాయని పేరుతో స్థానికంగా బెదిరిస్తున్నారు. మీరు ఆ కేసులు ఏంటో తేల్చలేరా? రెగ్యులరైజేషన్ ఇప్పటికీ కాలేదు. మీకు కూల్చే దమ్ము ఉందా? ఇలా ఓఆర్ఆర్ లోపల ఉండే హైడ్రా అధికారుల నిర్షక్ల్యంపై, మీకు చెప్పని విషయాలపై స్వేఛ్చగా చెప్పాలా?

##HYDRAA⁠ ⁠#HyderabadRealEstate⁠ ⁠#RevanthReddy⁠ ⁠#RanganathIPS⁠ ⁠#HyderabadDevelopment⁠ ⁠#InvestigativeJournalism⁠ ⁠#TelanganaPolitics⁠ ⁠#DevenderReddy⁠ ⁠#LandScam⁠ ⁠#GurukulTrust
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి