Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబందించి ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనికి, కారణం ఆయన ప్రతీ ఏటా అయ్యప్ప దీక్షలో 41 రోజులు ఉండి శబరిమల వెళ్ళి వస్తుండటమే. దీక్షలో ఉన్నన్ని రోజులు చరణ్ ఎంతో కఠినమైన నియమాలతో ఉంటాడు. అవసరమైతే ఆ 41 రోజులు షూటింగ్స్ కూడా పెట్టనివ్వడు. దాంతో, ఈ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.
మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి సినిమా ఈ ఆగస్టు 21న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్‌కి మంచి బజ్ క్రియేట్ అయి సినిమా బ్లాక్ బస్టర్ అనే టాక్ వచ్చింది. అయితే, ఇటీవల వచ్చిన మల్లెపూల పల్లకి సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతుండగా, ఈ సాంగ్‌లో చరణ్ కనిపించనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నిజంగా చరణ్ ఉన్నాడా లేదా అనేది ఇరుముడి సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది.
అయితే, దీనికి సంబందించి ఇప్పటి వరకూ ఇరుముడి సినిమా టీమ్ అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. అలాగే, చరణ్ టీమ్ కూడా ఈ విషయంలో ఎలాంటి అప్‌డేట్‌ని ఇవ్వలేదు. కానీ, తాజా సమచారం మేరకు ఇందులో, చరణ్ ఎలాంటి గెస్ట్ అపీరియన్స్ ఇవ్వలేదట. ఇది కేవలం క్రియేట్ చేసిన వార్తే అంటున్నారు. ప్రతీ యేటా చరణ్ అయ్యప్ప దీక్ష తీసుకుంటాడు కాబట్టి, మల్లెపూల పల్లకి సాంగ్‌లో చరణ్ కనిపిస్తే బావుంటుందనుకున్నారట. అంతేగానీ, ఆయన సినిమాలో కనిపించడం అనేది ఫేక్ న్యూస్ అని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
కాగా, ఇరుముడి సినిమా రవి తేజ కెరీర్‌లో ఎంతో ప్రత్యేకం. హీరోయిన్‌గా నటించిన ప్రియ భవానీ శంకర్ కి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా కీలకం. ఇక, ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఇటీవల వచ్చిన మల్లెపూల పల్లకి పాటకి విజె శేఖర్ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ అందించాడు. ఎప్పుడు, మాస్ అండ్ మాంచి ఊపున్న సాంగ్స్ చేసే శేఖర్, ఇప్పుడు మాత్రం ఓ అద్భుతమైన పాటను కంపోజ్ చేయడం అదృష్టం అని చెప్పాలి.


