తెలంగాణ

ఓటర్ల లిస్టులో పేరు లేదా? మళ్లీ ఓటు హక్కు పొందడం ఎలా అంటే!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

తెలంగాణలో ఇటీవల ముగిసిన ప్రత్యేక ముసాయిదా సేకరణ (SIR) ప్రక్రియ అనంతరం ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లలో 2.64 కోట్ల మంది నమోదు పత్రాలు డిజిటలైజ్ కాగా, దాదాపు 1.71 కోట్ల మంది ఓటర్ల పేర్లు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నమోదయ్యాయి.

తెలంగాణలో ఇటీవల ముగిసిన ప్రత్యేక ముసాయిదా సేకరణ (SIR) ప్రక్రియ అనంతరం ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లలో 2.64 కోట్ల మంది నమోదు పత్రాలు డిజిటలైజ్ కాగా, దాదాపు 1.71 కోట్ల మంది ఓటర్ల పేర్లు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నమోదయ్యాయి. కాగా 92.87 లక్షల మందికి తగిన ఆధారాలు నిర్ధారించుకోవడానికి ఈసీ నోటీసులు జారీ చేయనుండగా, ఇప్పటికే దాదాపు 73.39 లక్షల ఓట్లను వివిధ కారణాలతో తొలగించారు.

అయితే జాబితాలో పేరు లేనంత మాత్రాన ఓటు హక్కు పూర్తిగా కోల్పోయినట్లు కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముసాయిదా జాబితాలో పేరు లేని బాధితులు లేదా అకారణంగా తమ ఓటు తొలగించబడిందని భావించేవారు తిరిగి ఓటు హక్కు పొందేందుకు ఈసీ అవకాశం కల్పించింది. దీని కోసం ఫామ్‌-6 (Form-6) ద్వారా కొత్త ఓటరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకునేవారు ఈసీ అధికారిక పోర్టల్ (voters.eci.gov.in) లోకి వెళ్లి 'New Voter Registration (Form 6)' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

వ్యక్తిగత వివరాలతో పాటు వయస్సు, నివాస ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేసి దరఖాస్తు సబ్మిట్ చేయాలి. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు సంబంధిత బూత్ స్థాయి అధికారి (BLO) వద్ద లభించే ఫామ్‌-6 నింపి ఆధారాలతో సహా సమర్పించవచ్చు. 2026 అక్టోబరు 1 నాటికి 18 సంవత్సరాలు నిండే యువత కూడా ఫామ్‌-6 ద్వారా నూతన ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు లేదా పొరపాట్ల సవరణల కోసం సెప్టెంబరు 16 వరకు గడువు ఇవ్వబడింది. ఈ గడువులోగా వచ్చే దరఖాస్తులను క్షేత్రస్థాయి అధికారులు పరిశీలించి, అర్హులైన వారందరికీ ఓటర్ కార్డులను జారీ చేస్తారు. అనంతరం అక్టోబరు 19న తుది ఓటర్ల జాబితాను ఈసీ అధికారికంగా ప్రకటించనుంది.

#Telangana SIR Voter List 2026#Form 6 Voter Registration#Election Commission of India Telangana#Draft Voter List Notice Telangana#BLO Voter Registration TS#Voters ECI Portal Renewal#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి