తెలంగాణ

TG : సూర్యాపేట కలెక్టర్ సంతకం ఫోర్జరీ.. బ్యాంకు మేనేజర్ అరెస్టు

రచన: Kumar••3 నిమిషాల పఠనం

కలెక్టర్ సంతకం ఫోర్జరీకి పాల్పడి ఆర్థిక అవకతవకలకు తెరలేపిన బ్యాంకు మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.కొందరు అధికారులు కాసులకు కక్కుర్తి పడి ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.

కలెక్టర్ సంతకం ఫోర్జరీకి పాల్పడి ఆర్థిక అవకతవకలకు తెరలేపిన బ్యాంకు మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.కొందరు అధికారులు కాసులకు కక్కుర్తి పడి ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఏకంగా జిల్లా పాలనాధికారి సంతకం ఫోర్జరీ చేయడం అంటే మాములు విషయం కాదు.జిల్లా మొత్తానికి ఆయన జవాబుదారి. జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం మంజూరు చేసే నిధులు ఆయన సంతకం ద్వారానే విడుదల అవుతాయి.

అలాంటిది ఆయన సంతకం ఫోర్జరీ కావడంతో కలెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ ఘటన ఈనెల 15 జరగగా..ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సంతకాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజర్ కోడూరు రఘు ప్రసాద్ ఫోర్జరీ చేసినట్టు తెలిసింది.

కలెక్టర్, డీఆర్డీఏ పీడీ సన్యాసయ్యల జాయింట్ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో భాగంగా సంతకం ఫోర్జరీ జరిగినట్టు తెలిసింది. ఫోర్జరీ విషయాన్ని డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య గుర్తించి కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

దీంతో ఈ ఘటనపై కలెక్టర్ ఈ నెల 16న చివ్వెంల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపిన పోలీసులు బ్యాంకు మేనేజర్‌ను అరెస్టు చేసి ఈనెల 16న రిమాండ్‌కు పంపినట్టు తెలుస్తోంది. కాగా, ఏకంగా కలెక్టర్ సంతకం ఫోర్జరీ కావడం జిల్లాలోనే హాట్ టాపిక్ అయ్యింది. కలెక్టర్ సంతకం ఫోర్జరీ అయ్యిందని ముందుగానే అధికారులు గుర్తించడంతో ప్రభుత్వ నిధులు దారి మళ్లకుండా కాపాడగలిగారని చర్చ జరుగుతుంది.

https://x.com/pulsenewsbreak/status/2089550029996642541?s=20

#Suryapet collecter#signature#forgery#bank manager arrest#crime#telangana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి