ఏపీ

Ap : ఒంగోలులో సీబీఐ ఆకస్మిక తనిఖీలు..ఏం జరుగుతోంది?

రచన: Kumar••4 నిమిషాల పఠనం

ఏపీలోని సీబీఐ అధికారులు రంగ ప్రవేశం వేశారు. ఒంగోలు అద్దంకి బస్టాండ్ K.B రెస్టారెంట్‌లో అధికారుల ఆకస్మిక సోదాలు జరుపుతున్నట్టు సమాచారం. చీమకుర్తి గ్రానైట్ క్వారీ ప్రమాదాల కేసులో పలువురిని రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

ఏపీలోని సీబీఐ అధికారులు రంగ ప్రవేశం వేశారు. ఒంగోలు అద్దంకి బస్టాండ్ K.B రెస్టారెంట్‌లో అధికారుల ఆకస్మిక సోదాలు జరుపుతున్నట్టు సమాచారం. చీమకుర్తి గ్రానైట్ క్వారీ ప్రమాదాల కేసులో పలువురిని రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ క్వారీలో ఇటీవలి కాలంలో వరుసగా ప్రమాదాలు జరుగుతుండటమే కారణం. ఈ మధ్యే క్వారీలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందగా.. ప్రభుత్వం మరోసారి దీనిపై ఫోకస్ పెట్టింది.

ఇప్పటికే ఈ క్వారీ విషయంలో విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నట్టు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా తమకు నచ్చిన వారికి మైనింగ్ కాంట్రాక్టులు అప్పజెప్పిందని, ఏమాత్రం భద్రతా ప్రమాణాలు పాటించకుండా గెలాక్సీ స్టోన్ మైనింగ్ నడుస్తోందని అధికార కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉండగా, క్వారీ సేఫ్టీ మెజర్స్ పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సిన మైన్స్ సేఫ్టీ అధికారి (DDMS) రవిశంకర్ ఇటీవల రూ.2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.

అయితే, క్వారీలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంతో భద్రతా ప్రమాణాలపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులకు ఫిర్యాదు వెళ్లినట్టు సమాచారం. దీంతో ఏపీలో రంగప్రవేశం చేసిన సీబీఐ.. ముందుగా వాసవి క్వారీ అధినేత సిద్ధా సురేష్ సహా పలువురు గ్రానైట్ వ్యాపారులు, మైనింగ్ అధికారులును అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారణ జరుపుతున్నట్టు సమాచారం.

వీరందరినీ విజయవాడకు తరలించినట్టు తరలించి అక్కడ విచారించనున్నట్టు తెలుస్తోంది. ఇదిలాఉండగా, అక్రమమైనింగ్ కారణంగా ఏపీ ప్రభుత్వానికి రూ. వేల కోట్లు ఆదాయం నష్టం కలిగినట్టు విజిలెన్స్ అధికారులు నివేదిక ఇచ్చినట్టు సమాచారం. కొందరు మైనింగ్ నిర్వాహకులు తప్పుడు నివేదికలు సమర్పించి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని కాజేస్తున్నారని అధికారుల విచారణలో తేలినట్టు ప్రచారం జరుగుతోంది.

ఓవైపు సీబీఐ, మరోవైపు విజిలెన్స్ విచారణతో ఇకనైనా క్వారీలో ప్రమాదాలు చోటుచేసుకోకుండా భద్రతా ప్రమాణాలు మెరుగుపరచాలని కార్మికులు కోరుతున్నారు. ఇదిలాఉంటే కూటమి ప్రభుత్వం కావాలనే తమను ఇబ్బందులకు గురిచేస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

https://x.com/RTVnewsnetwork/status/2089575091252383908?s=20

#ongole#CBI officers#investigation#chemakuthi mines#vijayawada
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి