తెలంగాణ

Rakul Preet Singh: హీరోయిన్ రకుల్, బాలీవుడ్ ప్రొడ్యూసర్ల ఇండ్లలో ఐటీ దాడులు

రచన: Mahesh•••4 నిమిషాల పఠనం

Rakul Preet Singh: బాలీవుడ్ ప్రముఖ నిర్మాతల నివాసాలు, వారి కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ అధికారులు) చేపట్టిన ఆకస్మిక తనిఖీలు సినీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Rakul Preet Singh: బాలీవుడ్ ప్రముఖ నిర్మాతల నివాసాలు, వారి కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ అధికారులు) చేపట్టిన ఆకస్మిక తనిఖీలు సినీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అత్తింటితో పాటు పలువురు అగ్రశ్రేణి నిర్మాతలే లక్ష్యంగా ముంబైలోని 12 కీలక ప్రాంతాల్లో అధికారులు సోమవారం ఉదయం నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. సినిమా ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ పేరిట భారీ మొత్తంలో నిధులను అక్రమంగా విదేశాలకు మళ్లించారనే పక్కా సమాచారంతోనే ఈ మెరుపు దాడులు నిర్వహించినట్లు తెలుస్తుంది.

రకుల్ ప్రీత్ సింగ్ భర్త, నిర్మాత జాకీ భగ్నానీ, ఆయన తండ్రి ప్రముఖ నిర్మాత వాషు భగ్నానీకి చెందిన ‘పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్’ కార్యాలయాల్లో అధికారులు విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. వీరితో పాటు ప్రముఖ నిర్మాత కుమార్ మంగత్‌కు చెందిన ‘పనోరమా స్టూడియోస్’ ఆఫీసులు, నివాసాలను కూడా ఐటీ అధికారుల బృందాలు జల్లెడ పడుతున్నాయి. కుమార్ మంగత్ నిర్మించిన క్రేజీ ప్రాజెక్ట్ ‘దృశ్యం: ది కన్క్లూజన్’ అక్టోబర్ 2న థియేటర్లలో రిలీజ్‌కి సిద్ధమవుతున్న వేళ ఈ దాడులు జరగడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సోదాల్లో భాగంగా పలు అనుమానాస్పద బ్యాంక్ లావాదేవీలు, సినిమా బడ్జెట్ డీల్స్, విదేశీ పెట్టుబడులకు సంబంధించిన కీలక పత్రాలు, డిజిటల్ డేటాను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గతంలో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె భర్త, మామకు సంబంధించిన ప్రముఖ నిర్మాణ సంస్థలే కేంద్రంగా ఐటీ శాఖ కొరడా ఝుళిపించడం సినీ పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం రేపుతోంది. ప్రస్తుతం తనిఖీలు ఇంకా కొనసాగుతుండగా, పన్ను ఎగవేత, నిధుల మళ్లింపుపై అధికారులు అధికారిక ప్రకటన రిలీజ్ చేయాల్సి ఉంది.

#Rakul Preet Singh#Jackie Bhagnani#Vashu Bhagnani#Pooja Entertainment#Kumar Mangat#Panorama Studios#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి