తెలంగాణ

TG: సిరిసిల్లలో హైటెన్షన్..‘నా చావుకు కేటీఆరే కారణం’.. పెట్రోల్ పోసుకున్న దళిత రైతు!

రచన: Mahesh••3 నిమిషాల పఠనం

TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తమ భూమిని అన్యాయంగా లాక్కుని రోడ్డున పడేశారంటూ ఓ దళిత రైతు రోడ్డెక్కి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తమ భూమిని అన్యాయంగా లాక్కుని రోడ్డున పడేశారంటూ ఓ దళిత రైతు రోడ్డెక్కి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. "నా చావుకు మాజీ మంత్రి కేటీఆరే కారణం" అంటూ బాధిత రైతు వినోద్ నినదించడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. వెంటనే అప్రమత్తమైన తోటి రైతులు, స్థానికులు అతడి చేతిలోని పెట్రోల్ డబ్బాను లాగేసి అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

వివరాల్లోకి వెళ్తే.. 2022లో తంగళ్లపల్లి మండలంలో అగ్రికల్చర్ కాలేజీ నిర్మాణం కోసం దళితులకు చెందిన దాదాపు 40 ఎకరాల భూములను బెదిరించి లాక్కున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి ఇప్పిస్తామని నమ్మబలికిన కేటీఆర్, ఏళ్లు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తలేదని బాధితులు మండిపడుతున్నారు. కళాశాల పోను మిగిలిన భూమిని సైతం తమకు ఇవ్వకుండా కేటీఆర్ తన అనుచరులకే కట్టబెట్టారని దళిత రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

న్యాయం కోసం ఏళ్ల తరబడి అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా కనికరించకపోవడంతో విసిగిపోయిన వినోద్.. తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యయత్నానికి పూనుకున్నాడు. తమ పొట్ట కొట్టి మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, తమ భూములు తమకు దక్కేంత వరకు పోరాటం ఆపేది లేదని దళిత రైతులు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

#Telangana#TG News#Sircilla#Rajanna Sircilla#KTR#K T Rama Rao#Dalit Farmer#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి