సినిమా

Chiranjeevi: నెట్‌ఫ్లిక్స్ కోసం హోస్ట్‌గా మారబోతున్న మెగాస్టార్!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటేనే తెలుగు ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన క్రేజ్. హీరోగా ఎన్నో దశాబ్దాలుగా అలరిస్తున్న చిరు.. ఇప్పుడు మరో కొత్త అవతార్‌లో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారనే వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కోసం మెగాస్టార్ హోస్ట్‌గా కనిపించబోతున్నారనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో ఆయన మీలో ఎవరు కోటీశ్వరులు కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించారు.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిరు:

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టుకుంటూ కెరీర్‌ను జోరుగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే, బాబీ దర్శకత్వంలో కాకా చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాను 2027, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అనస్వర రాజన్ కీలక పాత్రలో కనిపించబోతోంది. అలాగే, విశ్వంభర సినిమాను మెగాస్టార్ పూర్తి చేశాడు. ఇంకా, విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది.

దసరా, ది ప్యారడైజ్ సినిమాలతో దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఓదెల తో చిరు ఒక సినిమాను చేయాల్సి ఉంది. ఈ సినిమాను నాని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే, ఇటీవల వచ్చిన ది ప్యారడైజ్ సినిమా ఫలితం భిన్నంగా రావడంతో..మెగాస్టార్ తో ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి.

నెట్‌ఫ్లిక్స్ తో చిరు ప్లాన్ ఏంటి?

చిరంజీవి హోస్ట్‌గా సరికొత్త ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నట్టుగా లేటెస్ట్ అప్‌డేట్. ఆయన వ్యాఖ్యాతగా కనిపించబోయే ఈ కార్యక్రమం ఏ తరహాలో ఉంటుంది? ఇందులో ఎవరెవరు పాల్గొంటారు? ఇది టాక్ షోనా లేదా ఎంటర్‌టైన్‌మెంట్ ఫార్మాట్‌లో ఉంటుందా? అనే విషయాలపై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ షోకి చిరు కూతురు సుష్మిత నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది.

#Chiranjeevi#Megastar Chiranjeevi#Netflix#Chiru Talk Show
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి